Huge Investment In Telangana : తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. జర్మన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. జర్మన్ సంస్థ Lite Auto GmbHతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.1500 కోట్లతో 100 ఎకరాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.

Huge Investment In Telangana : తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. జర్మన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ

Ktr (1)

Telangana an MoU with the German company : తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. జర్మన్ సంస్థ Lite Auto GmbHతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.1500 కోట్లతో 100 ఎకరాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. సోమవారం(డిసెంబర్6, 2021) హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జర్మన్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది.

ఈ సందర్భంగా Lite Auto GmbH డైరెక్టర్ బాలాఆనంద్ మాట్లాడుతూ త్వరలోనే తమ సంస్థని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 200 మిలియన్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తొమ్మిది వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు.

Etela Rajender : ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారు-మెదక్ కలెక్టర్

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పెట్టుబడిదారుల కష్టాలు తమకు తెలుసన్నారు. అందుకే టీఎస్ ఐపాస్ ను ప్రారంభించామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఉన్నవారికి 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ దేశంలోనే కాదు అమెరికాలో కూడా లేదన్నారు.

ఈ పాలసీ ద్వారా 17,500 కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. పరిశ్రమల స్థాపన కోసం 2 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉందన్నారు. టీఎస్ ఐఐసీ ద్వారా భూములు కేటాయిస్తామని చప్పారు. రూ.1500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన Lite Auto GmbHకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

Honor Killing : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. గర్భవతని కూడా చూడకుండా..

జర్మనీలో జీడీపీలో 80 శాతం చిన్న తరహా పరిశ్రమల నుంచే వస్తుందని గుర్తు చేశారు. అది మన దగ్గర కూడా రావాలన్నారు. మన దగ్గర ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు చాలా ఉన్నాయని తెలిపారు. త్వరలో హైదరాబాద్ నుంచి జర్మనీకి ప్రత్యేక ఫ్లైట్ సర్వీస్ ఉంటుందని తెలిపారు.