Telangana Govt : డిపాజిట్ స్కామ్‌లకు చెక్

ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగం సంస్థల బ్యాంకు ఖాతాలు, పిక్స్‌డ్‌ డిపాజిట్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Govt : డిపాజిట్ స్కామ్‌లకు చెక్

Ts Govt

Telangana government : డిపాజిట్ల స్కామ్‌లతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఖాతాలు ఏ విధంగానూ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా, మోసపూరిత విధానంలో కొన్ని సందర్భాల్లో డిపాజిట్ల నుంచి నగదు తీయడం, అనుమతి లేకుండా కొత్త ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తుండటంతో ఆర్థికశాఖ వాటిని అరికట్టే దిశగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగం సంస్థల బ్యాంకు ఖాతాలు, పిక్స్‌డ్‌ డిపాజిట్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని రకాల బ్యాంకు ఖాతాలకు సంబంధించి పూర్తి వివరాలను IFMIF పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని… ఆయా ఖాతాలకు ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలని మార్గదర్శకాల్లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎంప్యానెల్‌ చేసిన బ్యాంకుల్లోనే ఖాతాలు ఉండాలంది ఆర్థికశాఖ. తమ అనుమతి లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ప్రభుత్వ నిధులు జమ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

Telugu Academy : తెలుగు అకాడమీలో గోల్ మాల్.. కలర్ జిరాక్స్‌లతో రూ. 64 కోట్లు మాయం

ప్రస్తుతం ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలన్నింటిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఎంప్యానెల్ చేసిన బ్యాంకులో ఒకే ఖాతాగా ఉంచాలంది. అన్ని రకాల ఖాతాల నిర్వహణకు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలన్నింటిని మార్చి 10వ తేదీకల్లా ఆర్థికశాఖకు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.