Saamanyudu: థియేటర్లలో అట్టర్ ప్లాపైన సినిమా.. ఓటీటీలో ఊహించని రెస్పాన్స్!

కొన్ని సినిమాలు థియేటర్లలో అసలు ఆకట్టుకోవు. థియేటర్ రిలీజ్ సమయంలో సరైన రెస్పాన్స్ రాదు కానీ టీవీలలో వస్తే మాత్రం సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటాయి. ఈ మధ్య కాలంలో థియేటర్లలో..

Saamanyudu: థియేటర్లలో అట్టర్ ప్లాపైన సినిమా.. ఓటీటీలో ఊహించని రెస్పాన్స్!

Saamanyudu

Saamanyudu: కొన్ని సినిమాలు థియేటర్లలో అసలు ఆకట్టుకోవు. థియేటర్ రిలీజ్ సమయంలో సరైన రెస్పాన్స్ రాదు కానీ టీవీలలో వస్తే మాత్రం సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటాయి. ఈ మధ్య కాలంలో థియేటర్లలో పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సినిమాలు కొన్ని ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ మూవీస్, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్, థీమ్ సినిమాలు కొన్ని థియేటర్లలో పనికిరాకపోయినా ఓటీటీలలో మాత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి.

Saamanyudu: సామాన్యుడిగా రాబోతున్న విశాల్.. కమ్ బ్యాక్ అవుతాడా?

తెలుగు వాడైన తమిళ స్టార్ హీరో విశాల్ ఈ మధ్య సామాన్యుడుగా తెలుగులో కూడా థియేటర్లలోకి వచ్చాడు. తమిళంలో తన స్థాయి వసూళ్లను రాబట్టుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ గా మార్చి 4వ తేదీ నుంచి జీ5లో సామాన్యుడు స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడలోను ఈ సినిమా అందుబాటులో ఉంది.

Saamanyudu : ఒక నేరస్థుడు ఎలా పుట్టుకొస్తాడో తెలుసా?..

ఫస్ట్ డే నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ప్రేక్షకులు.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మాత్రం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీక్షకుల నుంచి ఈ సినిమాకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుండటం.. థియేటర్లలో ఎలా ఉన్నా ఓటీటీలో ఇలా ఆదరణ దక్కడంతో మేకర్స్ సంతోషిస్తున్నారు. పైగా తమిళంలో థియేటర్ల కంటే ఓటీటీలో ఇంకా బెటర్ రెస్పాన్స్ దక్కుతుండడం విశాల్ అభిమానులు ఆనంద పడిపోతున్నారు.