Tamilanadu Govt: రాష్ట్రంలో 3 రకాలుగా లాక్‌డౌన్‌!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. సెకండ్ వేవ్ ముందు ఉదృతంగా కమ్మేసిన ఉత్తరాదిన ముందే కేసులు తగ్గడంతో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఆంక్షల సడలింపు ఇచ్చేయగా దక్షణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో ఆదివారం నుండే లాక్ డౌన్ తొలగించేశారు..

Tamilanadu Govt: రాష్ట్రంలో 3 రకాలుగా లాక్‌డౌన్‌!

Tamilanadu Govt

Tamilanadu Govt: కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. సెకండ్ వేవ్ ముందు ఉదృతంగా కమ్మేసిన ఉత్తరాదిన ముందే కేసులు తగ్గడంతో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఆంక్షల సడలింపు ఇచ్చేయగా దక్షణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో ఆదివారం నుండే లాక్ డౌన్ తొలగించేశారు. మరో రాష్ట్రమైన ఏపీలో కూడా ఒక్కొక్కటి ఆంక్షలు తొలగిస్తూ వస్తున్నారు. ఏపీకి పొరుగురాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటకలో మాత్రం ఇప్పటికీ సాధారణ పరిస్థితి నెలకొనడం లేదు.

కాగా.. తమిళనాడులో మరోసారి లాక్ డౌన్ పొడిగించారు. ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగిస్తూ స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అదనంగా మరికొన్ని సడలింపులు ఇచ్చింది. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి.. మధ్య ప్రాంతంలోని 11 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగనుండగా మిగతా 23 జిల్లాల్లో పలు దుకాణాలు, ఆఫీసులు తదితర కార్యకలాపాల నిర్వహణకు సమయాన్ని పొడగించింది.

ఇక, చెన్నై చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలైన చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నాన్‌ ఏసీ బస్సులు, మెట్రో రైలుకి అవకాశం ఇవ్వగా ఈ-రిజిస్ట్రేషన్ లేకుండా ఆటోరిక్షాలు, అద్దె క్యాబ్‌లలో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. అంతేకాదు గరిష్ఠంగా వంద మందితో సినిమా, టీవీ షూటింగ్‌లకు అవకాశం కల్పించింది.