Coconut Oil : జుట్టు నుండి కాలి గోళ్ల వరకు కొబ్బరినూనెతో ఎన్నో లాభాలు

రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటంలో కొబ్బరినూనె సహాయపడుతుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచటంలో, కడుపులో ఉండే నులి పురుగుల్ని చంపటంలో మంచి పనితీరు కనబరుస్తుంది.

Coconut Oil : జుట్టు నుండి కాలి గోళ్ల వరకు కొబ్బరినూనెతో ఎన్నో లాభాలు

Coconut Oil

Coconut Oil : కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే కొబ్బరి నుండి తయారయ్యే కొబ్బరి నూనెను జట్టుకు మాత్రమే ఉపగిస్తుంటారు. అయితే కేరళ వంటి రాష్ట్రాల్లో దీన్ని వంట నూనెగా కూడా ఉపయోగిస్తారు. జట్టు నుండి కాలి గోర్ల వరకు కొబ్బరి నూనె వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేసి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కొబ్బరి నూనె మంచి సహాయ కారిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కొల్లెజాన్ చర్మంపై ముడతలను నివారిస్తుంది.

కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్ మెరుగుపరచడంలో సహాయపడే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది. కొబ్బరినూనెలో ఉండే లౌరిక్ ఆసిడ్ అధిక రక్తపోటు వంటి వివిధ హృదయ సమస్యలు దరిచేరకుండా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు హానికర క్రిములను అరికడతాయి. నోటి దుర్వాసన సమస్యలను పోగొడతాయి. కొబ్బరినూనెతో అయిల్ పుల్లింగ్ చేస్తే దంతాలలు మెరుపు సంతరించుకుంటాయి. కొబ్బరినూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్‌-ఇ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉండం వల్ల చర్మంపై మచ్చలు, గాయలు నయమైపోతాయి. రాత్రి నిద్రకు ముందుగా శరీరమంతా కొబ్బరి నూనెను రాయటం వల్ల వివిధ రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

పెళుసుగా ఉన్న గోళ్లను బలంగా, అందంగా తీర్చిదిద్దుకోవాలనుకునేవారు కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు కొద్ది నిమిషాల పాటు గోళ్లకు మర్దన చేసుకుంటే సరిపోతుంది. పొడిబారిన, పగిలిన పెదాలు కొబ్బరినూనె మంచి మాయిశ్చరైజర్‌ కూడా పనిచేసి పెదాలను సహజంగా, మృదువుగా మారుస్తుంది. కొబ్బరినూనెతో మర్దన చేసుకోవడం జట్టు బలంగా మారుతుంది. కుదుళ్లు గట్టిపడతాయి. రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటంలో కొబ్బరినూనె సహాయపడుతుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచటంలో, కడుపులో ఉండే నులి పురుగుల్ని చంపటంలో మంచి పనితీరు కనబరుస్తుంది. జుట్టుకు ప్రొటీన్ల నష్టాన్ని తగ్గించి జట్టురాలడాన్ని సైతం నివారిస్తుంది. అయితే కొబ్బరి నూనె వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంత మందిలో మాత్రం అలెర్జీలకు కారణమౌతుంది. శరీరంలో చెడు కొలెస్టరాల్ స్ధాయిని బాగా పెంచుతుంది. దీని వల్ల హృదయ సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి.