WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..కాల్ కట్ అయినా సులభంగా జాయిన్ కావొచ్చు

గ్రూప్ వీడియో కాల్ కు సంబంధించి వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. దీని ద్వారా గ్రూప్ వీడియో కాల్ నుంచి పొరపాటున, ఇతర కారణంతో కాల్ కట్ చేసిన వారు తిరిగి కాల్ లో యాడ్ కావొచ్చు.

WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..కాల్ కట్ అయినా సులభంగా జాయిన్ కావొచ్చు

Whatsapp

new feature in WhatsApp : వాట్సాప్ మరో ఫీచర్ ను తీసుకొచ్చింది. గ్రూప్ వీడియో కాల్ కు సంబంధించి వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్ వీడియో కాల్ నుంచి పొరపాటున, లేదంటే ఇతర కారణాలతో కాల్ కట్ చేసిన వారు తిరిగి కాల్ లో యాడ్ కావొచ్చు. దీని కోసం జాయిన్ అనే కొత్త ఆప్షన్ ను వాట్సాప్ తీసుకొచ్చింది.

వీడియో కాల్ కొనసాగుతున్న గ్రూప్ లోకి వెళ్తే పైన ఇన్ఫర్మేషన్ బార్ లో జాయిన్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆ గ్రూప్ కాల్ లో యాడ్ కావొచ్చు. గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ రెండింటిలోనూ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Pig Kidney to Human: పంది కిడ్నీని మనిషికి అమర్చిన సైంటిస్టులు

గ్రూప్ కాల్స్ కు సంబంధించి వాట్సాప్ ఇటీవలి కాలంలో చాలా మార్పులు చేస్తూ వస్తోంది. కాల్ మధ్యలో గ్రూప్ లోని వేరే వ్యక్తికి కనెక్ట్ చేసేలా ఇటీవల ఆప్షన్ తీసుకొచ్చింది. దీంతో పాటు కాల్ యూజర్ ఇంటర్ ఫేస్ ను కూడా మార్చింది. తాజాగా జాయిన్ ఆప్షన్ ను తీసుకొచ్చింది.