Telangana : ‘10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు’: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు మరిన్ని ఉప ఎన్నికలు జరగుతాయి అని..10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.

Telangana : ‘10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  టచ్ లో ఉన్నారు’:  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

there is possibility of by elections in many areas in TS  : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు మరిన్ని ఉప ఎన్నికలు జరగుతాయి అని..10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ తో పాటు..ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కలవరపడుతోంది బండి సంజయ్ వ్యాఖ్యలతో. ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశాక..అప్పుడే మునుగోడులో బైపోల్ ఎన్నికల కాక మొదలైంది. ఏపార్టీకి ఆ పార్టీ గెలుపుకోసం వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. ఈక్రమంలో బీజేపీ తెలంగాణ నేత బండి సంజయ్ తన వ్యాఖ్యలతో మరింత కాకరేపుతున్నారు.

Also read : Bypoll in Munugodu : మునుగోడు బైపోల్‌ హడావుడి.. ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్ ?

బీజేపీతో 10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలంగాణ బీజేపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలతో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీలు గాబరాపడుతున్నాయి. ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారోనని టెన్షన్ పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. దీనికి టీఆర్ఎస్ నాయకులే కారణమవుతారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు బీజేపీ గెలిచింది అంటూ ఈ సందర్భంగా మరింత కాకపెంచే విషయాన్ని గుర్తు చేశారు బండి. త్వరలో మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మిస్తాయన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారని..టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి అనేక మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also read : Komatireddy Venkat Reddy: రేవంత్‌ రెడ్డి.. నన్ను రెచ్చగొట్టొద్దు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీ చాలా సందర్భాల్లో మోడీ పథకాలను ప్రశంసించారంటూ గుర్తు చేశారు. తెలంగాణ వరదలతోను..అప్పుల్లోను కూరుకుపోయి అల్లాడుతుంటూ సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో మూడు రోజులుగా తిష్టవేసుకుని కూర్చున్నారని అక్కడ ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని జిట్టా బాలకృష్ణా రెడ్డి ఫామ్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎన్నికల వరకు తన పాదయాత్ర కొనసాగుతుందని..అప్పటి వరకు తాను ప్రజల్లోనే ఉంటాయనని..ప్రజల సమస్యలను తెలుసుకుని.. వాటినే మేనిఫెస్టో లో పెడతామని తెలిపారు బండి సంజయ్..