Coronavirus In India: దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. 68మంది మృతి

దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,815 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం..

Coronavirus In India: దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. 68మంది మృతి

Corona virus

Coronavirus In India: దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,815 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం 3,62,802 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15,815 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే గడిచిన 24 గంటల్లో 68 మంది కొవిడ్ తో బాధపడుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,26,996కు చేరింది.

Telangana Corona News : తెలంగాణకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్యే ఎక్కువ

దేశంలో కొవిడ్ నుంచి కోలుకున్న వారి రికవరీ రేటు దాదాపు 98.53 శాతానికి చేరుకుంది. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 4,35,93,112కి చేరుకుంది. శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. యాక్టివ్ కేసుల సంఖ్య 1,23,535 ఉండగా, తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,264కి తగ్గాయి. గడిచిన 24గంటల్లో 4,271 యాక్టివ్ కేసులు తగ్గాయి. దీంతో కరోనా యాక్టివ్ కేసులు 0.28 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Corona Virus : కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు

దేశ వ్యాప్తంగా  వ్యాక్సినే షన్ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం 24,43,064 టీకాలు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు అందించిన డోసుల సంఖ్య 207.71 కోట్లు దాటింది. ఇదిలాఉంటే ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 2,136 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, పది మంది మరణించారు.