మౌలానా అబుల్ కలాం ఆజాద్ హార్ట్ లో భారతీయత లేదు..యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మౌలానా అబుల్ కలాం ఆజాద్ హార్ట్ లో భారతీయత లేదు..యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

UP minister’s controversial remark ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ హార్ట్ లో ఎటువంటి భారతీయత ఉండేది కాదంటూ శుక్లా వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం(డిసెంబర్-25,2020)బల్లియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శుక్లా మాట్లాడుతూ…మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనసులో ఉన్నదాని గురించి చెప్పేందుకు నేను వెనుకాడను. ఆయన గుండెల్లో భారత్,భారతీయ లేదు. ఇస్లాం మతాన్ని స్వీకరించాలంటూ ఔరంగజేబ్ తమను ఒత్తిడి చేస్తున్నాడని..ఓరంగజేబు చేతుల్లో నుంచి తమను కాపాడాలంటూ కశ్మీరీ పండిట్లు గురు తేగ్ బహదూర్ ని వేడుకున్నారు..దీంతో కశ్మీరీ పండిట్ల కోసం వెళ్లిన గురు తేగ్ బహదూర్ ని ఔరంగజేబు చంపేశాడని శుక్లా తెలిపారు.

ఈ సత్యాలు చరిత్ర నుంచి తొలగించబడ్డాయని,దీనికి దేశపు మొదటి విద్యాశాఖ మంత్రి కారణమని శుక్లా వ్యాఖ్యానించారు. ఆ కాలంలోని “అయిన్ ఐ అక్బరీ” మరియు చరిత్రకారులు..అక్బర్ ని గొప్ప వ్యక్తిగా గుర్తించలేదన్నది వాస్తవమైనప్పటికి కూడా.. అక్బర్ చాలా గొప్పవాడని చరిత్రలో చేర్చారని శుక్లా అన్నారు.

కాగా,మంత్రి శుక్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మంత్రి వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అబుల్ కలాం ఆజాద్ పై అలాంటి కామెంట్స్ హాస్యాస్పదంగా,తగనివిగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి అశోక్ సింగ్ అన్నారు. బలమైన విద్యా వ్యవస్థ ద్వారా బలమైన భారత్ కు అబుల్ కలాం ఆజాద్ ఫౌండేషన్ వేశారని అన్నారు.భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్..గ్రామీణ పేద మరియు అమ్మాయిలను విద్యావంతులని చేయడానికి ఆయన ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు.