Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ కు చెక్ చెప్పే 5 జ్యూస్ లు ఇవే!

చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఊబకాయం మరియు గుండె జబ్బులు వస్తాయి. నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు,ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి వాటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్ధాయిలు పెరుగుతాయి.

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ కు చెక్ చెప్పే 5 జ్యూస్ లు ఇవే!

Bad Cholesterol : జీవనశైలి ,అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో అధిక కొలెస్ట్రాల్ అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలలో ఒకటి. కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండు చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఊబకాయం మరియు గుండె జబ్బులు వస్తాయి. నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు,ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ వంటి వాటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్ధాయిలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల జ్యూస్ లు తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

దానిమ్మ జ్యూస్; ఈ జ్యూస్ తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. అనేక పండ్ల రసాల మాదిరిగానే, దానిమ్మ రసంలో కూడా యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉంటాయి. దానిమ్మ రసం ఇతర పండ్ల రసాలతో పోలిస్తే కంటే అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

టమోటో జ్యూస్ ; సాధారణంగా ఎక్కువ మంది టమోటాలను సలాడ్ రూపంలో తీసుకుంటారు.. కానీ ప్రతిరోజు టమోటా జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు టమోటా జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో లభించే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ గా కరిగించడంలో సహాయపడుతుంది..

సొరకాయ జ్యూస్ ; సొరకాయ జ్యూస్ కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడుతుంది. ఇందులో 98 శాతం నీరు ఉండటం వల్ల అనవసరమైన కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఫలితంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

ఆరెంజ్ జ్యూస్ ; ఆరెంజ్ జ్యూస్ కూడా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఆరెంజ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కాలేయానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.

కాకర జ్యూస్ ; కాకరకాయ జ్యూస్ కూడా కొలెస్ట్రాలను తగ్గించడానికి సహాయపడుతుంది. చాలా మంది చేదుగా ఉంటుందన్న కారణంతో దీనిని ఇష్టపడరు.కాకరకాయ జ్యూస్ తాగితే మాత్రం కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరుగుతుంది.

గమనిక; ఈ సమాచారం కేవలం అవగామన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.