Smart Baby : తెలివైన బిడ్డ పుట్టాలంటే గర్భధారణ సమయంలో తినాల్సిన ఆహారాలు ఇవే!

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు, రెటీనా అభివృద్ధికి దోహదపడుతుంది. ట్యూనా మరియు సాల్మన్‌లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి.

Smart Baby : తెలివైన బిడ్డ పుట్టాలంటే గర్భధారణ సమయంలో తినాల్సిన ఆహారాలు ఇవే!

Pregnancy Foods

Smart Baby : ప్రతి తల్లిదండ్రులు సాధారణంగా తమకు పుట్టబోయే బిడ్డలు మానసికంగా, ఆరోగ్యపరంగా, మంచి తెలివితేటలు కలిగి ఉండాలని కోరుకుంటుంటారు. అయితే పుట్టబోయే బిడ్డలు తెలివితేటలు కలిగి ఉండాలని కోరుకుంటే మాత్రం గర్భదారణ సమయ నుండే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండేందుకు కావాల్సిన పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటం చాలా అవసరం. ఇక తెలివి తేటల విషయంలో జన్యువులు, వారసత్వ ప్రభావం కూడా ఉంటుంది. అయినప్పటికీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రమ గర్భధారణ మొదటి నెల నుండే మంచి ఆహారం తీసుకోవటం మొదలు పెట్టాలి.

గర్భదారణ సమయంలో ఆకుపచ్చని కూరలు తీసుకోవటం చాలా మంచిది. బచ్చలికూర ఈ సమయంలో తీసుకోవటం చాలా అవసరం. దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఫోలిక్ ఆమ్లం, ఫోలేట్, ఐరన్ కలిగి ఉంది. బచ్చలికూరలో ఫోలేట్, ఐరన్ ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు ఎ, బి 6, బి 12, సి, డి, ఇ, కె, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి. తాజా పండ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

గర్భధారణ సమయంలో తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లలో నారింజ, బ్లూబెర్రీస్, దానిమ్మ, బొప్పాయి, మామిడి,జామ, అరటి, ద్రాక్ష ఆపిల్ ఉన్నాయి. బ్లూబెర్రీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు మేలు చేస్తాయి. గుడ్లలలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. గుడ్లలో కోలిన్ అనే అమినో యాసిడ్ పిల్లల మెదడు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పాలలో కాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది. శిశువు అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం. మాంసం, గుడ్లు మరియు బీన్స్‌లో మంచి ప్రొటీన్లు ఉంటాయి.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు, రెటీనా అభివృద్ధికి దోహదపడుతుంది. ట్యూనా మరియు సాల్మన్‌లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ చేపల్లో పాదరసం తక్కువగా ఉంటుంది. చియా విత్తనాలు, వాల్‌నట్, సోయాబీన్, టోఫు, అవిసె గింజలు, అవిసె గింజల నూనెల ద్వారా ఒమేగా 3 కొవ్వులు పొందవచ్చు. పిండంలోని బిడ్డకు ప్రొటీన్ చాలా అవసరం. ప్రోటీన్ తృణధాన్యాలు, బీన్స్, సోయా గింజలలో ప్రోటీన్లు ఉంటాయి. జింక్ మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. గొడ్డు మాంసం, పంది మాంసం, గింజలు, చిక్కుళ్ళు ,తృణధాన్యాలలో జింక్ ఉంటుంది.