Vitamin B2 : విటమిన్ బి2 లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఇవే!

ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే గ్లాసిటిస్ అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాకుండా కళ్లలో రక్తం పేరుకున్నట్లుగా మచ్చలు, పెదవుల చివరలో పగుళ్లు, నోటిలో మంట, నాలుకపై పగుళ్లు, చర్మంపై పగుళ్లు వంటివి రావచ్చు.

Vitamin B2 : విటమిన్ బి2 లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఇవే!

Vitamin B2 : విటమిన్ బి 2 ని విటమిన్ -జి అని, ఎల్లో ఎంజైమ్ అని ,రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. నీటిలో కరిగే విటమిన్‌ ఇది. ప్రతి మనిషికి రోజువారిగా 1.3 మి.గ్రా. మోతాదు అవసరం అవుతుంది. అందాన్ని పెంపొందించడంలో విటమిన్ బి2నే కీలకం. చర్మం ముడతలను నిరోధించడం, పెదవుల చివర్లు పగలకుండా చూడటం, వెంట్రుకలు జీవంతో మెరుస్తుండటానికి తోడ్పడుతుంది. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులకు సంబంధించిన జీవక్రియలకు ఉపయోగపడుతుంది.

ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే గ్లాసిటిస్ అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాకుండా కళ్లలో రక్తం పేరుకున్నట్లుగా మచ్చలు, పెదవుల చివరలో పగుళ్లు, నోటిలో మంట, నాలుకపై పగుళ్లు, చర్మంపై పగుళ్లు వంటివి రావచ్చు. దీనిలోపం వల్ల చర్మంపై ముడతలు పడతాయి. గోళ్లు చిట్లటం, కాంతి పడినప్పుడు కళ్లు బైర్లుగమ్మినట్లు అనిపించటం, రక్తహీనత, యోని దగ్గర దురద, కాటరాక్ట్ వంటి సమస్యలు విటమిన్ బి 2 లోపం కారణంగా తలెత్తుతాయి.

బి 2 లోపాన్ని అదిగమించాలంటే కొన్ని రకాల ఆహారపదార్ధాలను తీసుకుంటే ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. పాలు, గుడ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, మాంసాహారాలలో ఇది పుష్కలంగా లభిస్తుంది. బొప్పాయి, సీతాఫలం, ఆఫ్రికాట్, వంటి పండ్ల ద్వారా విటమిన్ లోపాన్ని నివారించుకోవచ్చు. ఆవుపాలు, వాల్ నట్, బాదం తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన బి 2 విటమిన్ ను పొందవచ్చు.