Hepatitis Viruses : కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ వైరస్ లు ఇవే!

ఈ వైరస్ వచ్చినవారిలో తొలుత లక్షణాలేవీ కనిపించవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్. కొందరి మాత్రం కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపిస్తాయి. అక్యూట్‌ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు.

Hepatitis Viruses : కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ వైరస్ లు ఇవే!
ad

Hepatitis Viruses : శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం కాలేయం. ఇటీవలి కాలేయ వ్యాధుల ముప్పు బాగా పెరిగింది. జీవనశైలి, తినే ఆహారంలో మార్పులతో కాలేయ జబ్బులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ వైరస్ లే ఇందుకు కారణం. హెపటైటిస్ వైరస్​లతో ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. చాలా మందికి అసలు తాము ఈ వైరస్ ల బారిన పడ్డామన్న విషయమే తెలియటం లేదు. హెపటైటిస్ వైరస్ లలో ఎ,బి,సి,డి,ఇ అనే ఐదు రకాలుకాగా వీటిలో ఎ,ఇ వైరస్ లు వాటంతట అవే తగ్గిపోతాయి. కామెర్ల రూపంలో ఈ వైరస్ లు లివర్ పై తమ ప్రతాపాన్ని చూపిస్తాయి.

కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ వైరస్ లు;

హెపటైటిస్‌ ఎ: ఈ వైరస్ ఉన్న వారిలో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవటం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, మూత్రం ముదురు రంగులో రావటం, చర్మం, కళ్లు పసుపురంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హెపటైటిస్‌ మళ్లీ తిరగబెట్టొచ్చు. అపరిశుభ్ర వాతావరణంలో నివసించేవారికి, సురక్షిత నీరు అందుబాటులో లేనివారికి, హెపటైటిస్‌ ఎ ఇన్‌ఫెక్షన్‌ గలవారితో జీవించేవారికి, స్వలింగ సంపర్కులకు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

హెపైటిస్‌ బి: ఈ వైరస్ వచ్చినవారిలో తొలుత లక్షణాలేవీ కనిపించవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్. కొందరి మాత్రం కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపిస్తాయి. అక్యూట్‌ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. వాంతులు, తీవ్రమైన నిస్సత్తువ, ఆకలి లేకపోవటం వంటివి గలవారికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికశాతం మందిలో వైరస్‌ కూడా దానంతటదే తొలగిపోతుంది. అయితే కొందరిలో దీర్ఘకాల సమస్యగా మారే అవకాశం ఉంటుంది.. ఇన్‌ఫెక్షన్‌ ఆరు నెలల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్‌ హెపటైటిస్‌ బిగా భావిస్తారు. వైరస్‌ నిద్రాణంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది.

హెపటైటిస్‌ సి: హెపటైటిస్‌ బి లాగానే జ్వరం, అలసట, వికారం, కామెర్ల లక్షణాలు, కీళ్ల నొప్పులు, ఆందోళన, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం వంటివి లక్షణాలు ఉంటాయి. ఇది చాలామందిలో దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. కొందరిలో ఐదేళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తొచ్చు. కొందరికి కాలేయం గట్టి పడటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తటానికి దీర్ఘకాలం పడుతుంది. హెపటైటిస్‌ సితో హెపటైటిస్‌ బి కూడా ఉండటం, మద్యం అలవాటు, ఊబకాయం వంటివి సమస్య త్వరగా ముదిరేలా చేస్తాయి.

హెపైటిస్‌ డి: ఇది హెపటైటిస్‌ బి వైరస్‌ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది. చాలావరకు ఈ రెండు ఇన్‌ఫెక్షన్లు కలిసే ఉంటాయి. చాలామంది దీన్నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెపటైటిస్‌ బి మాదిరిగానే ఇన్‌ఫెక్షన్‌ గలవారితో లైంగిక సంపర్కం, శరీర స్రావాలు, ఒకరు వాడిని సూదులను మరొకరకు వాడటం వల్ల వస్తుంది.

హెపటైటిస్‌ ఇ: ఈ ఇన్‌ఫెక్షన్‌ గలవారి మలంతో కలుషితమైన నీటితో వైరస్‌ వ్యాపిస్తుంది. మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గటం, వికారం, వాంతి వంటివి కనిపిస్తాయి. కొందరికి కడుపునొప్పి, దురద, దద్దు, కీళ్ల నొప్పులూ తలెత్తొచ్చు. క్రమంగా చర్మం, కళ్లు, మూత్రం పచ్చ బడుతుంటాయి. మలం తెల్లగా వస్తుంది. కొద్దిగా కాలేయం ఉబ్బొచ్చు. హెపటైటిస్‌ ఇ ఇన్‌ఫెక్షన్‌ చాలావరకు తగ్గిపోతుంది.