బ్లడ్‌ గ్రూపుతో కరోనా.. ఈ గ్రూపు వారే సేఫ్.. ఎవరికి ప్రాణాంతకం?

  • Published By: srihari ,Published On : June 15, 2020 / 01:15 PM IST
బ్లడ్‌ గ్రూపుతో కరోనా.. ఈ గ్రూపు వారే సేఫ్.. ఎవరికి ప్రాణాంతకం?

శరీరంలోని బ్లడ్ గ్రూపులకు కరోనా వైరస్ సంబంధం ఉంటుందా? అంటే అవుననే అంటోంది ఓ అధ్యయనం. అమెరికా బయో టెక్నాలజీ కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో పరిశోధకులు సంబంధం ఉందని తేల్చేశారు. ఏ బ్లడ్ గ్రూపుల వారికి కరోనాతో ముప్పు ఉంటుందో చెప్పేశారు. ఒక్కో గ్రూపులో కరోనా ముప్పుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటాయో తేల్చేశారు. అన్ని గ్రూపుల్లో కల్లా ‘O’ గ్రూపువారికి కరోనా ముప్పు చాలా తక్కువగా ఉంటుందని తేల్చారు. మిగతా గ్రూపుల వారికి మాత్రం కరోనా ముప్పు తప్పదని చెబుతున్నారు. 

ఇక AB బ్లడ్ గ్రూపు రక్తం ఉన్నవారిలో ఎక్కువ ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. B, A వేర్వేరు రక్తం గ్రూపు వాళ్లలో కూడా ఇదే తరహా వైరస్ ప్రభావం ఉంటుందని తెలిపారు. A బ్లడ్ గ్రూపువారిలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని చైనా సహా ఇటాలియన్, స్పానిష్ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు.. కరోనా వైరస్ వ్యాప్తితో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని కొన్ని పరిశోధనలు తేల్చేశాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులపై కూడా అధిక ప్రభావం ఉంటుందిని లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు నిర్ధారించారు. 

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న కూడా ప్రాణాంతక వైరస్ లు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. శరీరంలోకి ఇతర హానికారక బ్యాక్టీరియా, వైరస్ లు ప్రవేశించినప్పుడు మనలోని రోగనిరోధక వ్యవస్థ వాటిపై దాడి చేస్తుంది. అలాంటి నిరోధక వ్యవస్థ బలహీనపడితే కరోనా వైరస్ మరింతగా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో నిర్ధారించారు. వ్యాధినిరోధకశక్తి పెరిగే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. D విటమిన్ అందేలా నూర్యరశ్మిలో కనీసం అరగంట సేపైనా నిలబడాలని సూచిస్తున్నారు. రక్తంలో తెల్లరక్త కణాలు, యాంటీబాడీస్ ఎక్కువగా తయారయ్యేలా చూసుకోవాలని అంటున్నారు.