Yashoda: యశోద సినిమాలో హైలైట్‌గా నిలవబోయే అంశాలు ఇవేనా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని వచ్చే వారం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

Yashoda: యశోద సినిమాలో హైలైట్‌గా నిలవబోయే అంశాలు ఇవేనా..?

These Elements To Be Highlight In Samantha Yashoda Movie

Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని వచ్చే వారం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను దర్శకులు హరి-హరీశ్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Yashoda: యశోద రన్‌టైం ఎంతో తెలుసా.. సామ్‌కు ఇది కలిసొస్తుందా..?

అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో హైలైట్ అంశాలు ఇవే అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో సమంత చేసే ఛేజింగ్ సీన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయట. అంతేగాక, ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఊహలకు ఏమాత్రం అందనవిగా ఉండబోతున్నాయట.

Yashoda: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న యశోద..

ఇలా రిలీజ్‌కు ముందరే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేస్తోంది చిత్ర యూనిట్. మరి ఈ సినిమానో ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఇంకా ఎన్ని ఉన్నాయా అని అభిమానులు అప్పుడే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి యశోద చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.