Fat And Weight : కొవ్వు కరిగి, బరువు తగ్గాలంటే ఈ పదార్ధాలు తింటే చాలు!

పోషకాలకు గుడ్లు నియలంగా ఉంటాయి. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తీసుకుంటే కడుపు నిండిన భావనతో ఉండి ఆకలి త్వరగా వేయదు.

Fat And Weight : కొవ్వు కరిగి, బరువు తగ్గాలంటే ఈ పదార్ధాలు తింటే చాలు!

Lose Weight

Fat And Weight : జీవనశైలి, తినే ఆహారంలో మార్పల కారణంగా చాలా మంది ఊబకాయం, అధిక బరువు, శరీరంలో అధిక కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు. కోవిడ్ తరువాత అధిక శాతం మందిని ఇలాంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి వాటి వల్ల ఇప్పటికే చాలా మంది గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. అధిక బరువు, అదనపు కొవ్వులను తగ్గించుకునే రోజు వారి వ్యాయంతోపాటుగా తీసుకునే ఆహారం పై దృష్టిపెట్టాలి. వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తూ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల బరువు తగ్గవచ్చు. వీటితో పాటు శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటి ద్వారా సులభంగా కొవ్వులు కరగటంతోపాటు, బరువు తగ్గవచ్చు.

మిర్చిపొడి ; మిరపలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల తృప్తిగా భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది. ఇదే విషయం ఒక అధ్యయనం తేలింది. క్యాప్సైసిన్ వల్ల ఎక్కువ కేలరీలు కోల్పోవడంతో పాటు కొవ్వు కరుగుతుందని అధ్యయనం తెలిపింది. ఆహార పదార్థాల్లో కారం పొడిని వాడటం వల్ల క్యాప్సైసిన్ శరీరానికి తగినంతగా అందుతుంది. తద్వారా అదనపు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్ ; ఆలివ్ ఆయిల్‌ ట్రైగ్లిజరైడ్లను తగ్గించటంలో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ నూనె శరీరంలో జిఎల్పి 1 అనే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఆలివ్ నూనె జీవక్రియ రేటును పెంచుతుంది. శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. వీటివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

కాఫీ ; కాఫీలోని కెఫిన్‌ శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతుంది. జీవక్రియల రేటు పెరగటం మూలంగా ఎక్కువ శక్తి అవసరమవుతుంది. శక్తి కోసం శరీరం కొవ్వును కరిగిస్తుందని ఫుడ్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం స్ఫష్టం చేసింది. శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును కాఫీ కరిగిస్తుంది. అయితే కాఫీని ఎక్కువగా తాగడం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయి. దీన్ని పరిమితంగానే తీసుకోవటం మంచిది.

గ్రీన్ టీ ; బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది. అనేక పరిశోధనల్లో సైతం ఇదే విషయం స్పష్టమైంది.

గుడ్లు ; పోషకాలకు గుడ్లు నియలంగా ఉంటాయి. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తీసుకుంటే కడుపు నిండిన భావనతో ఉండి ఆకలి త్వరగా వేయదు. తద్వారా బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. ఊబకాయులు రోజూ కనీసం మూడు గుడ్లను అల్పాహారంగా తీసుకోవడంవల్ల వారి శరీరంలో కొవ్వుతగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డులోని పచ్చసొన మాత్రం తీసుకోకూడదు. పోషకాహార నిపుణులు సూచించిన మోతాదులో మాత్రమే గుడ్లను తీసుకోవటం మంచిది.