Social Media : డిజిటల్ హవా.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారుగా!

డిజిటల్ మీడియాలో ఈమధ్య స్టార్లు ఫుల్ హల్ చల్ చేస్తున్నారు. రిలీజ్ అయిన తమ సినిమాలు, పాటలు, టీజర్లతో సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ సినిమాలో ‘సారంగ దరియా’ పాట 15కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో హడావిడి చేస్తోంది..

Social Media : డిజిటల్ హవా.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారుగా!

Social Media

Social Media: డిజిటల్ మీడియాలో ఈమధ్య స్టార్లు ఫుల్ హల్ చల్ చేస్తున్నారు. రిలీజ్ అయిన తమ సినిమాలు, పాటలు, టీజర్లతో సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ సినిమాలో ‘సారంగ దరియా’ పాట 15కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో హడావిడి చేస్తోంది.

Saranga Dariya Song

అల్లు అర్జున్ కూడా డిజిటల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పూజా హెగ్డే, అల్లు అర్జున్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘ DJ – దువ్వాడ జగన్నాథమ్’.. రేర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2017 లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ యూట్యూబ్ లో 10 కోట్ల వ్యూస్‌ని క్రాస్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

100 Million Views For Dj Duvvada Jagannadham Telugu Movie On You Tube

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మీద ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం భీమ్‌గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్.. కొమరంభీమ్ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసిన టీజర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు ఇంకా పెంచేసింది. ఇప్పుడు ఆ టీజర్ ఏకంగా సోషల్ మీడియాలో 5కోట్ల వ్యూస్‌ని క్రాస్ చేసి.. టాలీవుడ్‌లో ఫస్ట్ ఎవర్ వ్యూవ్డ్ టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

Rrr

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాలయ్య బాబు కూడా డిజిటల్ మీడియాలో హవా నడిపస్తున్నారు. బాలయ్య-బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ సినిమా కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.10 రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ 35 మిలియన్ల వ్యూస్ దాటి‌ యూట్యూబ్‌లో హవా నడిపిస్తోంది. యంగ్ హీరోలతో పోటీపడుతూ, ఇంకా సోలో హీరోగా కంటిన్యూ అవుతున్న బాలయ్య.. ‘అఖండ’ తో మరోసారి విశ్వరూపం చూపించబోతున్నారు.

Akhanda