Afghanistan:విమానం నుంచి జారిపడిన ఇద్దరు అన్నదమ్ములు..గుండెల్నిపిండేసే విషాద గాథ

తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవాలని అమెరికా విమానం టైర్ల‌ను ప‌ట్టుకొని వెళ్లే క్రమంలో జారిపడినవారిలో వారిలో ఇద్దరు అన్నదమ్ముల విషాద గాథ..

Afghanistan:విమానం నుంచి జారిపడిన ఇద్దరు అన్నదమ్ములు..గుండెల్నిపిండేసే విషాద గాథ

Afghanistan Kabul Airport

 

Afghanistan Kabul airport : ఆఫ్ఘ‌నిస్థాన్ తాలిబ‌న్ల హస్తగతం అయ్యింది. అక్కడ ప్రజల భవిష్యత్తు ముఖ్యంగా యువతులు, మహిళల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటువంటి దుర్భర పరిస్థితుల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అఫ్గాన్ దేశం విడిచి ఎక్కడికైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకోవటానికి విమానంలో ఖాళీ లేకపోయినా..విమానం టైర్ల‌ను పట్టుకొని వేలాడుతూ వేలాది అడుగుల ఎత్తులోంచి కొంతమంది జారిపడిపోయిన విషయం తెలిసిందే. ప్రాణాలు కాపాడుకుందామని అంతటి సాహసానికి పూనుకున్న వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. విమానం నుంచి జారి పడిన ప్రాణాలు కోల్పోయినవారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరొకరిది ఇంకా లభించలేదు. లభ్యమైన మృతదేహం పరిస్థితి చూస్తే గుండెలు పగిలిపోయేలా ఉంది. విమానం నుంచి అంత ఎత్తునుంచి పడిపోవటంతో కాళ్లు, చేతులూ పూర్తిగా నుజ్జునుజ్జ‌య్యాయి. తాలిబన్ల చెర నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకోవాలనే తపనతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములే..ప్రాణాలుదక్కించుకునే పోరాటంతో ప్రాణాలను కోల్పోయిన ఈ ఇద్దరి అన్నదమ్ముల విషాద గాథ గుండెల్ని పిండేస్తోంది.

తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవాలని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం టైర్ల‌ను ప‌ట్టుకొని వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించి ముగ్గురు వ్య‌క్తులు కింద ప‌డి మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఎంత వైర‌ల్ అయిందో తెలిసిందే. ఇది చూసి యావత్ ప్ర‌పంచ‌మంతా నివ్వెర‌పోయింది. అయితే తాజాగా అలా కింద ప‌డిన ముగ్గురిలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఉన్న‌ట్లు ఓ రిపోర్ట్ వెల్ల‌డించింది.

విమానం నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్ద‌రు అన్నదమ్ములు 17 ఏళ్ల అన్న రెజా 16 ఏళ్ల తమ్ముడు క‌బీర్ (పేర్లు మార్పు) ఉన్నారు. వాళ్లు కింద ప‌డుతున్న స‌మ‌యంలో చూసిన వాళ్లు ఆ ఇద్ద‌రి వివ‌రాలు వెల్ల‌డి కావ‌డంలో సాయం చేశారు. ఈ ఇద్ద‌రిలో పెద్ద వాడైన రెజా మృత‌దేహం ఎయిర్‌పోర్ట్‌కు ద‌గ్గ‌ర‌లోని ఓ భ‌వ‌నంపైన ల‌భించింది. అత‌ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. క‌బీర్ జాడ మాత్రం ఇంకా తెలియ‌రాలేదు. రెజా అంత ఎత్తునుంచి కింద పడిపోవటంతో అత‌ని కాళ్లు, చేతులూ పూర్తిగా నుజ్జునుజ్జ‌య్యాయి. శరీరంలో కొన్ని ఎముకలు కూడా విరిగిపోయాయి. అటువంటి పరిస్థితిలో అతని మృతదేహాన్ని నేనే తీసుకెళ్లి ఖ‌న‌నం చేశాన‌ని ఓ కుటుంబ స‌భ్యుడు తెలిపాడు. అయితే కబీర్ జాడ మాత్రం ఎంత వెతికినా దొర‌క‌లేద‌ని చెప్పాడు.

అఫ్గానిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోయింద‌ని తెలియ‌గానే ఓకుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అదే స‌మ‌యంలో కెన‌డా లేదా అమెరికాలో 20 వేల మంది ఆఫ్ఘ‌న్ల‌కు ఆశ్ర‌య‌మిస్తున్న‌ట్లు ఇరుగుపొరుగు మాట్లాడుకుంటే విని ఈ ఇద్ద‌రూ ఎయిర్‌పోర్ట్‌కు ప‌రుగు తీశారు. ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా వారి గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లిపోయార‌ని స‌దరు కుటుంబ స‌భ్యుడు చెప్పాడు. తాలిబ‌న్లంటే భ‌యంతోనే ప్ర‌తి ఒక్క‌రూ ఇలా దేశం విడిచి వెళ్లిపోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న క్రమంలో ఇలా వారిద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదిన వ్యక్తం చేశాడు. సదరు అన్నదమ్ముల కుటుంబంలో మొత్తం 8 మంది సంతానం కాగా.. ఈ ఇద్ద‌రే అంద‌రి కంటే పెద్ద వాళ్లు.

ఏది ఏమైనా ప్రాణంమీద తీపితో ఎలాగైనా బతకాలనే ఆశతో తాలిబన్ల పాలను నుంచి తప్పించుకోవాలనే తపనతో విమానం ఖాళీ లేకపోయినా విమానం టైర్ల‌ను పట్టుకొని వేలాడుతూ అక్కడి నుంచి తప్పించుకోవాలని తెగ ఆరాట పడ్డారు.కానీ వారి ప్రాణాలు గాల్లోనే కొట్టుమిట్టాడి ఆఖరికి భూమ్మీద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరిని కలచివేస్తోంది. గుండెల్ని పిండేస్తోంది.

చనిపోయిన అన్నదమ్ములు..గుండెల్ని పిండేసే విషాద గా