India vs Bangladesh: భారత్‌పై చాలా ఒత్తిడి పడేలా చేశారు: ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్

‘‘ఇక్కడి పిచ్ లు చాలా బాగున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా బాగా ఆడారు. మాపై నిజమైన ఒత్తిడి పడేలా చేశారు. ఈ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు, భారత్ గెలుపునకు సహకరించాడు. అతడు ఆడిన తీరు మమ్మల్ని ఆకర్షించింది. ఇండియా బ్యాటర్లు అందరూ డిఫెన్సును నమ్ముకోరు’’ అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. కాగా, అశ్విన్, శ్రేయాస్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

India vs Bangladesh: భారత్‌పై చాలా ఒత్తిడి పడేలా చేశారు: ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్

India vs Bangladesh

India vs Bangladesh: బంగ్లాదేశ్ క్రికెటర్లు రెండో టెస్టు మ్యాచులో ఇవాళ భారత్ పై చాలా ఒత్తిడి పడేలా చేశారని టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మీర్పూర్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా కష్టపడాల్సి వచ్చింది. 74 పరుగులకే టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత ఓడిపోయే స్థితి నుంచి భారత్ ను అశ్విన్, శ్రేయాస్ గట్టెక్కించి మ్యాచును గెలిపించారు. ఈ మ్యాచులో అశ్విన్ 42, శ్రేయాస్ 29 పరుగులు చేశారు. వారి 71 పరుగుల భాగస్వామ్యం వల్లే టీమిండియా మ్యాచు గెలిచింది.

దీనిపై అశ్విన్ స్పందిస్తూ… ‘‘ఇక్కడి పిచ్ లు చాలా బాగున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్లు చాలా బాగా ఆడారు. మాపై నిజమైన ఒత్తిడి పడేలా చేశారు. ఈ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు, భారత్ గెలుపునకు సహకరించాడు. అతడు ఆడిన తీరు మమ్మల్ని ఆకర్షించింది. ఇండియా బ్యాటర్లు అందరూ డిఫెన్సును నమ్ముకోరు’’ అని చెప్పాడు. కాగా, అశ్విన్, శ్రేయాస్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Father of New India Row: మోదీని ‘న్యూ ఇండియా’ జాతిపితగా అభివర్ణించడం ఆయనకే అవమానం: సంజయ్ రౌత్