‘న్యాయం గెలవడమే ఇంపార్టెంట్’.. ఆసక్తికరంగా తిమ్మరసు టీజర్..

10TV Telugu News

Thimmarusu: విభిన్నపాత్రల్లో విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి‘ అనేది ట్యాగ్‌లైన్. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.‘టాక్సీవాలా’ ఫేం ప్రియాంక జవాల్కర్ హీరయిన్. శరణ్‌ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా టీజర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ విడుదల చేసి సినిమా మంచి హిట్ కావాలని మూవీ యూనిట్‌కు విషెస్ తెలిపారు.‘కేసు గెలిచామా, ఓడామా అన్నదికాదు ఇంపార్టెంట్.. సంపాదన ఎంతనేదే ఇంపార్టెంట్’.. అని ఓ క్యారెక్టర్ చెబితే.. ‘‘నాకు మాత్రం న్యాయం గెలవడమే ఇంపార్టెంట్ సార్’’ అని హీరో బదులివ్వడం చూస్తే అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనేది అర్థమవుతోంది.సత్యదేవ్ మరోసారి తన నేచురల్ యాక్టింగ్‌తో అలరించబోతున్నాడని చెప్పొచ్చు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. సంగీతం : శ్రీచరణ్ పాకాల, కెమెరా : అప్పు ప్రభాకర్, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నె.