Bengaluru woman: ఆటోలో ఎయిర్‌పాడ్స్ మరిచి ఆఫీసుకు వెళ్లిపోయిన మహిళ.. డ్రైవర్ చేసిన పనికి నెటిజన్ల ఫిదా

ఆటోలో ప్యాసింజర్లు ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి రావడం కష్టం. కొంతమంది డ్రైవర్లు మాత్రం నిజాయితీగా, తమ కస్టమర్లకు వాళ్లు మర్చిపోయిన వస్తువుల్ని తిరిగిస్తుంటారు. అలా తాజాగా బెంగళూరులో ఒక డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Bengaluru woman: ఆటోలో ఎయిర్‌పాడ్స్ మరిచి ఆఫీసుకు వెళ్లిపోయిన మహిళ.. డ్రైవర్ చేసిన పనికి నెటిజన్ల ఫిదా

Bengaluru woman: ఆఫీసుకు వెళ్లే హడావిడిలో ఎయిర్‌పాడ్స్ ఆటోలోనే మర్చిపోయిందో మహిళ. అయితే, ఈ విషయంలో ఆటో డ్రైవర్ చేసిన పనికి ఆ మహిళతోపాటు, నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. షిదికా అనే ఒక మహిళా టెకీ బెంగళూరులోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

ఆమె ఆఫీసుకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే, ఆఫీసుకు చేరుకున్న తర్వాత హడావిడిలో తన ఎయిర్‌పాడ్స్ ఆటోలోనే మర్చిపోయింది. అలాగే ఆఫీసుకు వెళ్లిపోయింది. తర్వాత తన ఆటోలో ఎయిర్‌పాడ్స్ ఉండటం చూశాడు డ్రైవర్. వాటిని ఎలాగైనా ఆ మహిళకు ఇవ్వాలనుకున్నాడు. ముందుగా ఆమె ఎవరో కనిపెట్టాలనుకున్నాడు. దీనికోసం తను ఎయిర్‌పాడ్స్ కనెక్ట్ చేసుకున్నాడు. వీటి ద్వారా ఆ మహిళ పేరు తెలుసుకున్నాడు. ఆ పేరు ప్రకారం తనకు ఫోన్‌పేలో డబ్బులు చెల్లించిన ఆమెను గుర్తించాడు. తర్వాత ఆఫీసుకు తిరిగి వెళ్లి, అక్కడ సెక్యూరిటీ గార్డుకు ఎయిర్‌పాడ్స్ ఇచ్చేశాడు.

Cheapest Electric Car: దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధర ఎంతంటే

ఆమెకు సంబంధించిన ఫోన్ నెంబర్ వివరాలు కూడా అందించాడు. దీని ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ ఆమెకు ఎయిర్‌పాడ్స్ తిరిగి అందించారు. సంతోషంతో ఎయిర్‌పాడ్స్ తీసుకున్న షిదిక ఆ డ్రైవర్‌ను అభినందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఆ విషయాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‪కు నెటిజన్లు స్పందిస్తున్నారు. డ్రైవర్ నిజాయితీని, తెలివిని అభినందిస్తున్నారు. ఆ మహిళను గుర్తించడానికి అతడు చేసిన ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.