zinc : జింక్ లోపిస్తే మీ శరీరంలో జరిగేది ఇదే!
ధునిక జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంలో జింక్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. జింక్ లోపిస్తే శరీర బరువు అనూహ్యంగా తగ్గుతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. జింక్ లోపం పురుషుల సంతానోత్పత్తిపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుంది.

zinc : మానవ శరీరానికి రోజువారిగా పోషకవిలువలు అందించటం అన్నది చాలా ప్రధానమైదని ఇవి శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తి , బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయటం,గుండె ఆరోగ్యంగా ఉంచటం,చర్మం, వెంట్రుకలు సంరక్షించటం వంటివాటికి తోడ్పడతాయి. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన పోషకాలలో జింక్ ముఖ్యమైనది. శరీరంలో జింక్ తగ్గితే.. జుట్టు రాలడం, గోళ్లలో మార్పులు, అతిసారం, ఇన్ఫెక్షన్, చిరాకు, ఆకలి లేకపోవడం, సంతానలేమి సమస్యలు, కంటి సమస్యలు, బరువు తగ్గడం, గాయాలు త్వరగా తగ్గకపోవడం, రుచి, వాసన కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంలో జింక్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. జింక్ లోపిస్తే శరీర బరువు అనూహ్యంగా తగ్గుతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. జింక్ లోపం పురుషుల సంతానోత్పత్తిపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. తరచుగా అనారోగ్యం బారిన పడకుండా ఇది కాపాడుతుంది. జింక్‌కు గాయాలను త్వరగా నయం చేయటం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగించటం వంటి వాటికి తోడ్పడుతుంది.
రోజుకు మహిళలకు 8 మిల్లీగ్రాముల మోతాదులో జింక్ సరిపోతుంది. పురుషులకు నిత్యం 11 మిల్లీగ్రాముల జింక్ శరీరానికి అందించాల్సి ఉంటుంది. పప్పు దినుసులు, అవిసె గింజెలు, గుమ్మడికాయ విత్తనాలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, జీడిపప్పు, బాదంపప్పు, మటన్, ఆల్చిప్పలు, బీన్స్, శనగల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. నిత్యం ఈ పదార్థాలను తీసుకున్నట్లయితే జింక్ శరీరానికి సరిపడిన మోతాదులో అందుతుంది.