World Most Polluted Cities: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లోని ఆ రెండు నగరాలు..

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (HEI) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన నూతన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో టాప్ 20 జాబితాలో భారతదేశం నుంచి మూడు నగరాలు ఉన్నాయి.

World Most Polluted Cities: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లోని ఆ రెండు నగరాలు..

world’s most polluted cities

World Most Polluted Cities: ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (HEI) స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ విడుదల చేసిన నూతన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో టాప్ 20 జాబితాలో భారతదేశం నుంచి మూడు నగరాలు ఉన్నాయి. వాటిలో ఢిల్లీ, కోల్ కతా తొలి రెండు స్థానాలో ఉండగా, 14వ స్థానంలో ముంబై నగరం ఉంది. PM 2.5 (2.5 మైక్రాన్లు లేదా చిన్న పరిమాణంలో ఉండే నలుసు కాలుష్య కారకాల వర్గాన్ని సూచిస్తుంది) సంబంధిత కారకాలతో అనారోగ్యం భారిన పడిన వారిలో.. బీజింగ్ లో 1,00,000 మందికి 124 మరణిస్తుండగా, ఢిల్లీలో 106 మరణాలు, అదేవిధంగా 99 మందితో కోల్‌కతా 8వ స్థానంలో ఉంది. ఐదు చైనా నగరాలు టాప్ 20లో ఉన్నాయి.

World Polluted Cities : ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీనే టాప్..!

NO2 సగటు విస్తరణ పరంగా షాంఘై అగ్రభాగాన ఉంది. అయితే ఈ జాబితాలో టాప్ 20లో ఏ భారతీయ నగరం కూడా లేదు. ప్రపంచంలోని అత్యధిక జనాభాగా కలిగిన నగరాల్లో PM 2.5 మరియు NO2 రెండింటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనలను అధిగమించాయని నివేదిక పేర్కొంది. 2019లో ఢిల్లీ యొక్క సగటు PM 2.5 ఎక్స్‌పోజర్ 110 మైక్రోగ్రాములు ప్రతి క్యూబిక్ మీటర్‌గా ఉన్నట్లు నివేదిక కనుగొంది. ఇది క్యూబిక్ మీటరుకు ఐదు మైక్రోగ్రాముల WHO బెంచ్‌మార్క్ కంటే 22 రెట్లు ఎక్కువ. కోల్‌కతాలో సగటున క్యూబిక్ మీటరుకు 84 మైక్రోగ్రాముల ఎక్స్పోజర్ ఉంది. షాంఘైలో సగటున NO2 ఎక్స్పోజర్ 41.6 మైక్రోగ్రాములు ప్రతి క్యూబిక్ మీటర్, రష్యాలో మాస్కో (క్యూబిక్ మీటరుకు 40.2 మైక్రోగ్రాములు) తర్వాతి స్థానంలో ఉన్నాయి. NO2 ఎక్స్పోజర్ కోసం WHO ప్రమాణం ఒక క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు. 2019లో నివేదికలో చేర్చబడిన 7,000 నగరాల్లో 86% కాలుష్య కారకాలకు గురికావడం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాన్ని మించిందని, అందువల్ల దాదాపు 2.6 బిలియన్ల మందిపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది.

Most Pollted Country India : కాలుష్య భారతం.. ప్రపంచంలోని 30 తీవ్ర కలుషిత నగరాల్లో 22 ఇండియాలోనే

ప్రపంచవ్యాప్తంగా నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, నగరాల్లో నివసించే వారి ఆరోగ్యంపై వాయు కాలుష్యం యొక్క ప్రభావాలు కూడా పెరుగుతాయని అంచనా వేయబడింది. కాలుష్య స్థాయిని తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ముందస్తు చర్యలు యొక్క ప్రాముఖ్యతను ఈ నివేదిక నొక్కి చెబుతుందని HEI సీనియర్ సైంటిస్ట్ పల్లవి పంత్ అన్నారు. అధ్యయనం. WHO యొక్క గాలిలో నాణ్యత డేటాబేస్ గురించి ప్రస్తావిస్తూ.. PM2.5ని ట్రాక్ చేయడానికి ప్రస్తుతం 117 దేశాలు మాత్రమే గ్రౌండ్ లెవల్ మానిటరింగ్ సిస్టమ్‌లను కలిగి ఉన్నాయని, 74 దేశాలు మాత్రమే NO2 స్థాయిలను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొంది.