Prime Minister Modi: దేశానికి ఆ రెండు సమస్యలు చెదపురుగులా తయారయ్యాయి.. జనజీవనం నుంచి వాటిని తరిమేద్దాం

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై తోమ్మిదవ సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Prime Minister Modi: దేశానికి ఆ రెండు సమస్యలు చెదపురుగులా తయారయ్యాయి.. జనజీవనం నుంచి వాటిని తరిమేద్దాం

PM Modi

Prime Minister Modi: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై తోమ్మిదవ సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయన్న మోదీ.. అదే సమయంలో దేశాన్ని అవినీతి, వారసత్వం అనే రెండు సమస్యలు చెదపురుగులా పట్టిపీడిస్తున్నాయని అన్నారు. ప్రజలంతా ఏకమై ఆ రెండింటిని జనజీవనం నుంచి తరిమేద్దామంటూ మోదీ పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలిస్తేనే సామాన్యుడి జీవితం మెరుగవుతుందని, దేశవ్యాప్తంగా అవినీతిపై ఆందోళన వ్యక్తమవుతుందని అన్నారు. అవినీతిపరులపై క్షమ కూడా కనిపిస్తున్నదని, అయితే వారిని క్షమిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని మోదీ అన్నారు. అవినీతి, అవినీతి పరుల విషయంలో జాగృతమవ్వాలని, అవినీతికి పాల్పడేవారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని ప్రధాని మోదీ అన్నారు.

Independence Day Celebrations: న్యూ ఇండియా సాకారంకోసం కృషిచేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుంది.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

వారసత్వ రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని ప్రధాని అన్నారు. వారసత్వంపై మాట్లాడితే రాజకీయ భావనగా విమర్శిస్తారని, ప్రజాస్వామ్యానికి అది విఘాతం కలిగిస్తున్నదని మోదీ చెప్పారు. బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల వల్ల ప్రతిభ ఉన్నప్పటికీ అనేక మందికి అవకాశాలు లభించడం లేదని, అది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. వారసత్వ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, దీని నుండి భారతదేశాన్ని విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులను కోరారు.

Independence Day Celebrations: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..

ప్రధాని నరేంద్ర మోదీ 90నిమిషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించారు. వచ్చే 25ఏళ్లు అత్యంత ప్రధానమైనవని, కేంద్ర, రాష్ట్రాలు ప్రజల ఆశల సాకారమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతిక్షణం కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దేశ అభివృద్ధిలో భాగంగా మనమంతా ఐదు అంశాలపై ప్రమాణాలు చేయాలని ప్రధాని చెప్పారు. వాటిలో దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, బానిసత్వపు ఆలోచనను మనసులో నుంచి తీసిపారేయండని ప్రధాని కోరారు. అదేవిధంగా 130 కోట్ల మంది భారతీయుల మధ్య ఐక్యత ఉండాలని, ప్రజంతా కలిసి పనిచేయాలని, ప్రతి పౌరుడు తమ బాధ్యతను గుర్తించుకొని పని చేయాలని మోదీ స్పష్టం చేశారు. మేము ప్రమాణం చేసినప్పుడు దానిని నెరవేరుస్తామని, అందుకే నా మొదటి ప్రసంగంలో స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమం వచ్చిందని ప్రధాని హైలైట్ చేశారు. చివరి వ్యక్తి కోసం శ్రద్ధ వహించాలనే మహాత్మా గాంధీ కల, చివరి వ్యక్తిని సమర్థుడిగా మార్చడం అతని ఆకాంక్ష అని ప్రధాని మోదీ అన్నారు.