Fruit Juices : బరువు తగ్గాలనుకునే వారు… ఎలాంటి జ్యూస్ లు తాగాలంటే…

ద్రాక్షరనం కూడా బరువు తగ్గేందుకు ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో ప్రొటీన్లతోపాటు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ప్రతి మూడు రోజుల కొకసారి ఒక గ్లాసు ద్రాక్షా జ్యూస్ తాగితే శరీర బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Fruit Juices : బరువు తగ్గాలనుకునే వారు…  ఎలాంటి జ్యూస్ లు తాగాలంటే…

Juices

Fruit Juices : ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, శారీరక వ్యాయామం లేకపోవటంతో చాలా మంది వయస్సుకు మించి బరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు ఆరోగ్య నిపుణులో, స్నేహితులో, సోషల్ మీడియాలో వచ్చే వెయిట్ లాస్ టిప్ప్ వంటి వాటిని చూస్తూ బరువు తగ్గించుకునే పనిలో నిమగ్నమౌతారు.

బరువు తగ్గే క్రమంలో కొందరు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ కొత్త సమస్యలు కొనితెచ్చకుంటుండగా మరికొందరు తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ క్రమేపి బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గాలనుకునే వారికి జ్యూస్ లు బాగా పనిచేస్తాయని న్యూట్రిషియన్ నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల రసాలను తాగటం వల్ల శరీర బరువును త్వరగా తగ్గించుకోవచ్చని చెప్తున్నారు.

బరువు తగ్గాలనుకునే వారికి టమోటా జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. తాజా టమోటోలను తీసుకుని వాటిని బాగా కడిగి గిన్నెలో ఉడికించాలి. ఉడికించిన టమోటోలను మిక్సీలో గ్రైండ్ చేసి అందులో తగినంత బెల్లం కలుపుకుని తాగటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

ద్రాక్షరనం కూడా బరువు తగ్గేందుకు ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో ప్రొటీన్లతోపాటు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ప్రతి మూడు రోజుల కొకసారి ఒక గ్లాసు ద్రాక్షా జ్యూస్ తాగితే శరీర బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీటిని ఓ గ్లాసులో తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ తోపాటు , ఓ టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే తొందరగా బరువు తగ్గించుకోవచ్చు.

పైనాపిల్ జ్యూస్ శరీర బరువు తగ్గటానికి బాగా ఉపకరిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో అతిబరువు అనర్ధదాయకంగా మారింది. అనేక అనారోగ్య సమస్యలు బరువు కారణంగానే వస్తుండటంతో అంతా బరువు తగ్గేందుకు వివిధ రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో జ్యూసులు కూడా బరువు తగ్గేందుకు చక్కగా ఉపకరిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు