Poison: కరోనా మందు అంటూ విషం ఇచ్చి కుటుంబాన్ని చంపేశాడు.. ఎందుకంటే?

అప్పు ఇచ్చి రాబట్టుకునే క్రమంలో చివరకు ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. కరోనా మందు పేరుతో అప్పు తీసుకున్నవాడు చేసిన కుట్రకు ఓ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు.

Poison: కరోనా మందు అంటూ విషం ఇచ్చి కుటుంబాన్ని చంపేశాడు.. ఎందుకంటే?

Police Arrested Two People

Police arrested two people: అప్పు ఇచ్చి రాబట్టుకునే క్రమంలో చివరకు ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. కరోనా మందు పేరుతో అప్పు తీసుకున్నవాడు చేసిన కుట్రకు ఓ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. త‌మిళ‌నాడులోని రాష్ట్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కీజ్వాని గ్రామానికి చెందిన ఆర్ క‌ళ్యాణ‌సుంద‌రం(43), క‌రుప్ప‌న‌కౌందేర్(72) అనే వ్య‌క్తి దగ్గర కొన్ని నెల‌ల క్రితం రూ.15ల‌క్ష‌లు అప్పు తీసుకున్నాడు.

అప్పు తిరిగి తీసుకునే క్రమంలో సుందరంపై క‌రుప్ప‌న‌కౌందేర్ ఒత్తిడి చేశాడు. అప్పు చెల్లించేందుకు డ‌బ్బు లేక‌ అప్పు ఇచ్చిన వ్యక్తి కుటుంబాన్నే చంపేయాలని ప్లాన్ చేశాడు సుందరం. అందుకోసం స్నేహితుడు శ‌బ‌రి(25) స‌హాయం తీసుకోగా.. శ‌బ‌రి హెల్త్ వ‌ర్క‌ర్‌గా వెళ్లి క‌రుప్ప‌న‌కౌందేర్‌ కుటుంబానికి క‌రోనా నివార‌ణ‌ మందులు పేరిట విషాన్ని ఇచ్చాడు.

ఇవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే మందు అని చెప్పి ఇవ్వగా.. క‌రుప్ప‌న భార్య మ‌ల్లిక‌, కూతురు దీప‌, ప‌ని మ‌నిషి కుప్ప‌ల్ ఆ మెడిసిన్స్‌ తీసుకున్నారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే వారు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మ‌ల్లిక చ‌నిపోయింది. దీప‌, కుప్ప‌ల్ మ‌రుస‌టి చనిపోయారు. క‌రుప్ప‌న ప‌రిస్థితి విష‌మంగా ఉందని చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టగా.. ప్రాధమిక విచారణలో ముగ్గురి మృతికి సుంద‌రం, శ‌బ‌రి ఇచ్చిన మెడిసిన్సే కార‌ణ‌ం అని పోలీసులు గుర్తించారు. సుంద‌రం, శ‌బ‌రిని అదుపులోకి తీసుకున్నారు.