Heavy Rain: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy Rain: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ  జిల్లాల్లో రెడ్ అలర్ట్

Rain In Hyd

Heavy Rain: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Rain

ముఖ్యంగా రాబోయే మూడు రోజులు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ సైతం జారీ చేశారు.

Rain (1)

రాష్ట్రంలోని జగిత్యాల, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ అయింది.

Rain (2)

మరోవైపు ములుగు, సిద్ధిపేట, నల్గొండ, మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, జనగామ, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ అయింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Rain (4)

ఇదిలాఉంటే హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాల దృష్ట్యా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.