Muslim Woman Jeans : జీన్స్ వేసుకున్న ముస్లిం యువతి..దారుణంగా కొట్టిన షాపు యజమాని

జీన్స్ ధరించి బుర్ఖా వేసుకోలేదని ఓ యువతిపై మొబైల్ షాపు యజమాని దాడి చేశాడు. ముస్లింల పరువు తీస్తున్నావని తిడుతు మరో ఇద్దరితో కలిసి దాడికి దిగారు.

Muslim Woman Jeans : జీన్స్ వేసుకున్న ముస్లిం యువతి..దారుణంగా కొట్టిన షాపు యజమాని

Thrown Out Of Shop For Wearing Jeans

Assam Woman Jeans : జీన్స్ ప్యాంటు వేసుకన్నందుకు ఓ ముస్లిం యువతిని దారుణంగా కొట్టిన ఘటన అస్సోంలో జరిగింది. ముస్లిం అమ్మాయివి..బుర్ఖా వేసుకోకుండా జీన్స్ వేసుకుంటావా? సిగ్గులేదూ? అంటూ అసభ్యంగా తిట్టి ఆమెను షాపునుంచి గెంటివేసి దారుణంగా కొట్టిన ఘటనతో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అసోంలోని బిశ్వ‌నాథ్ జిల్లాలో గ‌త వారం చోటు చేసుకోగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆల‌స్యంగా వెలుగు చూసింది.

బిశ్వ‌నాథ్ జిల్లాలోని చారియాలియాకు చెందిన ఓ ముస్లిం అమ్మాయి.. ఇయ‌ర్ ఫోన్స్ కొనేందుకు ఓ మొబైల్ దుకాణానికి వెళ్లింది. ఆ షాపు ఓన‌ర్ నూరుల్ అమీన్ ఆమె వంక ఎగాదిగా చూస్తు నువ్వు ముస్లిం అమ్మాయివి కదూ..బుర్ఖా వేసుకోకుండా బయటకొచ్చావు..పైగా జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు..సిగ్గులేదా? ముస్లిం పరువు తీస్తున్నావు అంటూ నానా రకాలుగా తిట్టాడు. అంతేకాకుండాఆమెతో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. ప‌రుష పదజాలం వాడి దూషించాడు. షాపు నుంచి గెంటేయటమే కాకుండా మరో ఇద్దరితో కలిసి ఆమె యువతిని కొట్టారు.

Read more : బుర్ఖా వేసుకుందని బూతులు తిట్టింది

దీంతో పాపం ఆ యువతి ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో ఆమె తండ్రి ఆ షాపుకు వెళ్లి..నా కూతుర్ని ఎందుకు కొట్టారని మీకే హక్కు ఉంది? అని ప్రశ్నించగా అతడిపై కూడా దాడికి పాల్పడ్డారు షాపు యజమాని మరో ఇద్దరితో కలిసి. దీంతో యువతిని తీసుకుని తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కూతుర్ని షాపు య‌జ‌మాని తీవ్రంగా హింసించార‌ని ఫిర్యాదు లో తెలిపాడు. పట్టపగలు నా కూతుర్ని ఇలా కొట్టటానికి తామేమన్నా అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల పాలనలో ఉన్నామా? అసోంలో తాలిబ‌న్ సిస్ట‌మ్‌ను తీసుకువ‌స్తున్నార‌ంటూ తన ఆవేదన వ్యక్తంచేశాడు. తన కూతురిపై దాడికి పాల్పలడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరాడు.

బుర్ఖా వేసుకోవాలా? మరే డ్రెస్ వేసుకోవాలనేది వారి వారి ఇష్టం. కానీ బుర్ఖాయే ధ‌రించాల‌ని ఒత్తిడి తేవ‌డం సరికాద‌ని..అసామీ క‌ల్చ‌ర్‌ను ఫాలో అవుతే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించాడు. మేము అస్సాంలో పుట్టి పెరిగాము. మేం అస్సామీయులం. అస్సాం సంస్కృతిని అనుసరిస్తున్నాము. నా కుమార్తె BCA చదువుతోంది. ఏది ధరించాలో ఆమె ఇష్టం. బుర్ఖా వేసుకుని తీరాలని చెప్పటానికి ఎవ్వరికి హక్కులేదు. బుర్ఖా వేసుకోకపోతే కొడతారా? నాకూతుర్ని కొట్టటానికి వారికేం హక్కు ఉంది? అని ఆగ్రహంగా ప్రశ్నిస్తు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దీంట్లో భాగంగా పోలీసులు..బాధితురాలు, ఆమె తండ్రిపై దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

Read more : positive for 16 students : 16మంది మెడికల్ కాలేజీ విద్యార్ధులకు కరోనా

ఈ ఘటనపై సదరు యువతి మీడియాతో మాట్లాడుతు..”నేను మొబైల్ షాపుకు వెళ్లాను. వృద్ధుడైన యజమాని నువ్వు జీన్స్‌ వేసుకుని వీధుల్లో తిరుగుతున్నావు..అది చూసిన మిగిలిన ముస్లిం అమ్మాయిలు కూడా చెడిపోతారు. నువ్వు ఇలాగే జీన్స్ వేసుకుని మా ఇంటికి వస్తే..నా కోడలు బురఖా ధరించని చెప్పవచ్చు..అది మా కుటుంబంపైనే ప్రభావం పడుతుంది. నువ్వు జీన్స్ వేసుకోవటం వల్ల సాటి ముస్లిం యువతులపై ఈ ప్రభావం పడుతుంది? అంటూ నానా దుర్భాషలు ఆడాడని తెలిపింది. ఈ ఘటన అక్టోబర్ 25న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి చ్చింది. ఈ గటనలో ప్రధాన నిందితులు షాపు యజమాని నూరుల్ అమీన్, సుఫికుల్ ఇస్లాం, రఫీకుల్ ఇస్లాంలను అరెస్టు చేసారు పోలీసులు. దీనిపై సీనియర్ పోలీసు అధికారి రాజేన్ సింగ్ మాట్లాడుతు..బాధితురాలి కుటుంబ సభ్యులు బిస్వనాథ్ చారియాలీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని..నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.