Viral: ఎలుగుబంటి ముందు మోకరిల్లిన పెద్దపులి.తరువాత ట్విస్ట్ చూడాల్సిందే..

అడవిలో సింహం తరువాత అంతటి రేంజ్ ఉన్నది పెద్దపులికే. దాన్ని చూస్తే ఏజంతువైనా తోకముడుస్తుంది. అటువంటి పెద్దపులి థమ్కీ ఇచ్చిందో ఎలుగుబంటి.దీంతో పెద్దపులి ఎలుగు కాళ్లముందు మోకరిల్లింది

Viral: ఎలుగుబంటి ముందు మోకరిల్లిన పెద్దపులి.తరువాత ట్విస్ట్ చూడాల్సిందే..

Tiger Sits Down After Bear Stands On Legs

Tiger Sits Down After Bear Stands On Legs : అడవిలో సింహం తరువాత అంతటి రేంజ్ ఉన్న జంతువు పెద్దపులి. దాన్ని చూస్తే ఏజంతువైనా తోకముడుస్తుంది. అటువంటి పెద్దపులి థమ్కీ ఇచ్చిందో ఎలుగు బంటి. పెద్దపులి ఎదురువస్తేనే కాదు ఆ చుట్టుపక్కల ఉంటే ఏ జంతువైనా దాక్కుంటుంది ప్రాణాలు దక్కించుకోవటానికి. కానీ ఎలుగు బంటి మాత్రం పులి ముందు వెళుతుంటే దాని వెనుకే దర్జాగా నడుస్తు వెళ్లింది. వెనక్కి తిరిగిని పెద్దపులిని చూసి ఏమాత్రం అదరలేదు. బెదరలేదు. సరికదా..దానికి థమ్కీ ఇచ్చింది.దాంతో పాపం అంత పెద్ద క్రూరమృగం కూడా ఎలుగుబంటిని చూసి కింద చతికిలపడిపోయింది. ఈ ట్విస్ట్ చూసి మనం కూడా షాక్ అవుతాం. ఇదేందీబై..ఏమైందీపులికి అనుకుంటాం..

Read more : Wine car : వైన్‌తో నడిచే కారు నడుపుతున్న ప్రిన్స్ చార్లెస్..దటీజ్ రాయల్ రాజకుటుంబం రేంజ్

ఈ వీడియోలో..ఓ దారిగుండా ఓ పెద్దపులి వెళుతోంది. దారిలో ఉన్న పులి.. వెకన ఓ ఎలుగుబంటి దర్జాగా నడుచుకుంటు వచ్చింది. పులి వెనక్కి తిరిగింది. అంతే ఎలుగుబంటి ఏమాత్రం భయపడకపోగా..ఒక్కసాగిగా ఎలుగుబంటి పైకి నిలబడింది.దాంతో పాపం అంత పెద్దపులి నేలపై చతికిలపడిపోయింది.దాదాపు ఎలుగుబండికి మోకరిల్లిపోయిందా?అన్నట్లుగా పెద్దపులిపైకి కస్సుమంటూ లేస్తుంది ఎలుగుబంటి. ఎలుగుబంటిని చూసిన పులికి ఏం చేయాలో తెలియక.. కింద కూర్చుండిపోయింది.అది భయంతోనా లేక దేంతోనా అనేది అనవసరం.

Read more :World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..

అనంతరం మరోసారి పులిపైకి లేచిన ఎలుగుబంటి తన వెనకువైపునకు తిరిగి చూస్తుంది. వీడియో తీస్తున్న వ్యక్తిని చూసి వెంటనే ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సందీప్‌ త్రిపాఠి అనే ఐఏఎఫ్‌ అధికారి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘పులిని బెదిరిస్తూ.. మనిషిని చూసి పరిగెత్తిన ఎలుగుబంటి’ అంటున్నారు. ‘పెద్దపులికే ధమ్కీ ఇచ్చిన ఎలుగుబంటి మనిషిని చూసి పారిపోవటం నిజంగా నిజంగా ట్విస్టే’ అని మరికొందరు అంటున్నారు.