తీహార్ జైలులో కరోనా కలకలం..అత్యాచార నిందితుడికి వైైరస్

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 12:12 AM IST
తీహార్ జైలులో కరోనా కలకలం..అత్యాచార నిందితుడికి వైైరస్

తీహార్ జైల్లో కరోనా కలకలం రేపింది. అత్యాచార ఆరోపణలు కింద అరెస్టయి..ఈ జైలుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర ఖైదీలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. జైలు సిబ్బంది, అధికారులతో పాటు, మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడికి న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడి విధించడంతో పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. 

అత్యాచార బాధితురాలికి కరోనా వైరస్ ఉందని తేలింది. దీంతో నిందితుడికి కూడా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. దీంతో అతడికి పరీక్షలు చేయగా ఈ విషయం బయటపడింది. ఈ జైలులో పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితుడికి కరోనా ఉందని తేలడంతో ఇతను ఉన్న సెల్ లో ఉన్న ఖైదీలు, ఇతరులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి కరోనా అంటిందేమోనన్న భయం నెలకొంది. 

కానీ ఇతరులకు పరీక్షలు చేయగా వారిలో వైరస్ సోకలేదని తేలిందని, కానీ ముందుజాగ్రత్తలో భాగంగా క్వారంటైన్ కు తరలించామని డైరెక్టర్ జనరల్ (జైలు) సందీప్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం జైల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఖైదీలు ఉంటున్న సెల్ లను శానిటైజ్ చేశామన్నారు. జైల్లో ఉన్న వారికి ముందుగా వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ములాఖత్ తాత్కాలికంగా నిషేధించామని, టెలిఫోన్ సౌకర్యం కల్పించామన్నారు. 

జైల్లో ఉన్న సిబ్బందికి కోసం కరోనా సోకకుండా వేసుకునే డ్రెస్, గ్లౌజ్ లు, మాస్క్ లు అందించామని, చేతులు శుభ్రపరుచుకొనేందుకు సబ్బులు ఏర్పాటు చేశామన్నారు. జైలు నుంచి విడుదలయ్యే వారికి పూర్తిగా వైద్య పరీక్షలు చేస్తామన్నారు. 

Read More:

కోవిడ్19 కేసులను కట్టడిచేసిన భారత్ తీరు…ప్రశంసనీయం: WHO చీఫ్ సైంటిస్ట్

కరోనా కట్టడికి పాల వ్యాపారి భౌతిక దూరం ఐడియా అదుర్స్