TikTok: ‘టిక్‌టాక్’ మళ్లీ వస్తోందా.. అసలు నిజమేంటి?

ఒకప్పుడు దేశంలో కోట్లాది మంది ఫేవరెట్ యాప్ ‘టిక్‌టాక్’ మళ్లీ వచ్చే అవకాశాలున్నాయా? దీనిపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ‘బీజీఎమ్ఐ’ కూడా మళ్లీ వస్తుందా?

TikTok: ‘టిక్‌టాక్’ మళ్లీ వస్తోందా.. అసలు నిజమేంటి?

TikTok: రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ‘టిక్‌టాక్’ మళ్లీ రాబోతుంది అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు ఇటీవల బ్యాన్ చేసిన మొబైల్ గేమ్ ‘బీజీఎమ్ఐ’ కూడా తిరిగి వస్తుందనే ప్రచారం మొదలైంది. అయితే, నిజంగానే ఇవి మళ్లీ రాబోతున్నాయా? ‘స్కైఈస్పోర్ట్స్’ సీఈవో శివ నాంది చెప్పిన వివరాల ప్రకారం దేశంలో ‘టిక్‌టాక్’ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.

Chiranjeevi Tweets: బింబిసార, సీతా రామం సక్సెస్‌లపై మెగాస్టార్ కామెంట్స్!

2020లో కేంద్రం దీనిపై భద్రతా కారణాల రీత్యా నిషేధం విధించింది. ఆ సంస్థ నేరుగా తిరిగి దేశంలో ప్రారంభమయ్యే అవకాశం లేదు. అందుకే ఇండియాకు చెందిన ‘స్కైఈస్పోర్ట్స్’ సంస్థతో ‘టిక్‌టాక్’ మాతృసంస్థ అయిన ‘బైట్ డ్యాన్స్’ చర్చలు జరుపుతోంది. ఇరు కంపెనీల మధ్య చర్చలు ఫలిస్తే ‘టిక్‌టాక్’ మళ్లీ వచ్చే అవకాశం ఉందని శివ నాంది అన్నారు. ఒకవేళ ‘టిక్‌టాక్’ తిరిగొస్తే ‘బీజీఎమ్ఐ’ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ‘బీజీఎమ్ఐ’ గేమ్‌ను కేంద్రం ఇటీవల బ్యాన్ చేసింది. అయితే, హఠాత్తుగా ఈ బ్యాన్ విధించారని చాలా మంది భావిస్తున్నారు. కానీ, దీనికి నాలుగు నెలల ముందు నుంచే కేంద్రం ఈ అంశంపై కసరత్తు చేసిందని, ఆ తర్వాతే దీనిపై బ్యాన్ విధించిందని శివ నాంది తెలిపారు.

Tiniest Bike: అతిచిన్న సైకిల్ నడిపిన వృద్ధుడు.. ఆకట్టుకుంటున్న క్రేజీ వీడియో

గేమ్ బ్యాన్ చేయడానికి వారం రోజుల ముందు కూడా కేంద్రం ఒక మధ్యంతర నోటీసు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే ఇది నిషేధం కాదని, మధ్యంతర ఉపసంహరణ మాత్రమేనని, త్వరలోనే బీజీఎమ్ఐ తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ‘టిక్‌టాక్’కు దేశంలో కోట్లాది మంది మెంబర్లు ఉండేవారు. ఈ షార్ట్ వీడియో యాప్.. అతి తక్కువ కాలంలోనే దేశంలో భారీ సక్సెస్ సాధించింది.