TN CM Stalin: కరోనా రాదా.. అయితే నేనూ కారం ఎక్కువగా తింటా.. విద్యార్థులతో సీఎం స్టాలిన్ సరదా సంభాషణ

తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, మానవత్వం చాటుకుంటూ తమిళ ప్రజలచేత శెభాష్ అనిపించుకుంటున్నారు.

TN CM Stalin: కరోనా రాదా.. అయితే నేనూ కారం ఎక్కువగా తింటా.. విద్యార్థులతో సీఎం స్టాలిన్ సరదా సంభాషణ

Tn Cm Stalin

TN CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, మానవత్వం చాటుకుంటూ తమిళ ప్రజలచేత శెభాష్ అనిపించుకుంటున్నారు. శుక్రవారం అవడి సమీపంలోని తిరుముల్లవాయల్ పరిసరాల్లో నివసించే సంచాజాతుల నివాసాలను సీఎం స్టాలిన్ సందర్శించారు. వీరు పూసలతో హారాలు, గాజులు తయారు చేసే చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి కష్టసుఖాలను స్టాలిన్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అవడి బస్టాండ్ సమీపంలోని నారికురవర్ కమ్యూనిటీకి చెందిన విద్యార్థిని దివ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు.

Stalin’s Gym Video: జిమ్‌లో సీఎం స్టాలిన్.. 68ఏళ్ల వయసులో ఫిట్‌‌గా వర్కౌట్స్!

అనంతరం ఇంటి మహిళ సీఎం స్టాలిన్‌కు అల్పాహారం అందించారు. అల్పాహారాన్ని పక్కనే ఉన్న చిన్నారికి తినిపించుకుంటూ.. ఇడ్లీతో పాటు పెట్టిన నాటుకోడి కూరను స్టాలిన్ తిన్నారు. ఈ క్రమంలో వారి మధ్య సరదా సంభాషణ సాగింది.. నాటుకోడి కారంగా ఉంది.. మసాలా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నారా అని మహిళను ప్రశ్నించారు. దానికి ఆ మహిళ నవ్వుతూ.. ఇంత వేడిగా ఉన్న ఆహారం వల్లనే మాకు జలుబు, జ్వరం, ఇతర జబ్బులు రావని సీఎంకు బదులిచ్చింది. అంతేకాక కారం ఎక్కువగా తింటే కరోనా కూడా రాదని నమ్మకం అయ్యా అంటూ మహిళ బదులిచ్చింది. దీంతో స్పందించిన స్టాలిన్.. ఇకపై నేనుకూడా కారంగా ఉండే ఆహారాన్నితీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటాను అంటూ నవ్వులు పూయించారు.

CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్

అనంతరం స్టాలిన్ అక్కడి ప్రజలకు సీఎం ఆరోగ్య బీమా పథకం కార్డు, రేషన్ కార్డులు, సామాజిక రక్షణ పథకం కింద ఆర్థిక సాయం, ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంచారజాతుల వారు తయారుచేసిన వివిధ పూసల హారాన్ని సీఎం స్టాలిన్‌ మెడలో వేసి సత్కరించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తానని అన్నారు.