CM KCR: ఏడేళ్ల తరువాత నేడు దామరచర్లకు సీఎం కేసీఆర్.. అధికారులతో సమీక్ష

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణ పనులను టీజెఎన్‌కో కు అప్పగించింది.  2014 లో ప్లాంటు కోసం స్థల పరిశీలన జరిగింది. సీఎం కేసీఆర్ 2015 జూన్ 8న పనులకు శంకుస్థాపన చేశారు.

CM KCR: ఏడేళ్ల తరువాత నేడు దామరచర్లకు సీఎం కేసీఆర్.. అధికారులతో సమీక్ష

CM KCR

CM KCR: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇవాళ నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు. సీఎం రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు జిల్లా చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉదయం 10గంటలకు ప్లాంటు వద్దకు చేరుకోనున్నారు.

CM KCR: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమవుతున్నారా? జోరందుకున్న ఊహాగానాలు

సీఎం కేసీఆర్ ఉదయం 11గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో మధ్నాహ్నం 12గంటలకు దామరచర్ల చేరుకుంటారు. ఇందుకోసం ప్లాంటు వద్ద అధికారులు రెండు హెలిపాడ్లను సిద్ధం చేశారు. సీఎం వెంట టీజెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు రానున్నారు. ఇక్కడ బాయిలర్, ఈఎస్పీ, నీటి నిల్వ రిజర్వాయర్, బూడిద నిల్వప్లాంటు, రైల్వేలైన్ పనులను సీఎం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ప్లాంటు పనులపై సీఈ కార్యాలయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో కలిసి టీజెన్‌కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటల వరకు సమీక్ష సమావేశం ఉంటుంది. అనంతరం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

CM KCR Warning : మీకు భవిష్యత్తు ఉండదు.. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణ పనులను టీజెఎన్‌కో కు అప్పగించింది.  2014 లో ప్లాంటు కోసం స్థల పరిశీలన జరిగింది. సీఎం కేసీఆర్ 2015 జూన్ 8న పనులకు శంకుస్థాపన చేశారు. 2017 అక్టోబర్ లో పనులు ప్రారంభించారు. ప్లాంటు పనులు సుమారు 60శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ఏడేళ్ల తర్వాత పనుల పర్యవేక్షణకు వీర్లపాలెం రానున్నారు.