Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర

బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. నగల తయారికి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం.. పెట్టుబడి కోసం వాడే 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గాయి.

Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర

Gold Rate

Gold Rate : దేశంలో బంగారం క్రయ విక్రయాలు ప్రతిరోజూ రూ.కోట్లలో జరుగుతుంటాయి. ఇక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిత్యం బంగారం, వెండి ధరల్లో ఎంతోకొంత మార్పు ఉంటుంది. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు నిత్యం ధరలు చూస్తూనే ఉంటారు. ఇక కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే.. రెండు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. బుధవారం స్వల్పంగా తగ్గాయి. కాగా 22 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై 120 తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,410గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఇలాఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,440 ఉంది.