India vs New Zealand T20 Match: నేడు ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ టీ20 మ్యాచ్.. వర్షం ఆడనిస్తుందా?

ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య ఇవాళ మౌంట్ మౌంగనుయ్‌లో 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ టీ20 మ్యాచ్ కు కూడా వర్షం ముప్పుపొంచి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. పగటిపూట మౌంట్ మౌంగనుయ్‌లో ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం జల్లులు, మధ్యాహ్నం సమయంలోనూ జల్లులు పడే అవకాశం ఉంది. ఇక సాయంత్రం మ్యాచ్ జరిగే సమయంలో 68శాతం జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అంచనా.

India vs New Zealand T20 Match: నేడు ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ టీ20 మ్యాచ్.. వర్షం ఆడనిస్తుందా?

India vs New Zealand Match

India vs New Zealand T20 Match: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో జరగాల్సిన ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రద్దయింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ లేకుండా హార్థిక్ పాండ్య సారథ్యంలో టీమిండియా జట్టు న్యూజీలాండ్ లో పర్యటిస్తుంది. ఈ క్రమంలో యువ క్రీడాకారులకు ఈ సిరీస్ మంచి అవకాశంగా మారింది. కానీ, శుక్రవారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో యువ క్రీడాకారులు నిరాశకు గురయ్యారు.

IND vs NZ T20 Match: భారత్, కివీస్ టీ20 మ్యాచ్ రద్దు.. వర్షం కారణంగా రద్దు చేసిన అంప్లైర్లు

ఇవాళ మౌంట్ మౌంగనుయ్‌లో 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, న్యూజీలాండ్ జట్లు సెమీఫైనల్ దశలో ఓటమిపాలై ఇంటిబాటపట్టాయి. ఇవాళ జరిగే మ్యాచ్‌లో గెలిచి సత్తాచాటాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముఖ్యంగా యువ క్రీడాకారులతో నిండిపోయిన టీమిండియా ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే మౌంట్ మౌంగనుయ్ లో ఇవాళ రాత్రి 7.30 గంటలకు (భారత్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు) జరిగే మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉంది.

India vs New Zealand: రేపటి నుంచి కొత్త సిరీస్ ప్రారంభం.. శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి టీ20

స్థానిక వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. పగటిపూట మౌంట్ మౌంగనుయ్‌లో ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం జల్లులు, మధ్యాహ్నం సమయంలోనూ జల్లులు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో 89శాతం వర్షం పడే అవకాశం ఉంది. అంతేకాదు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం 18శాతం ఉండగా, 81శాతం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. సాయంత్రం మ్యాచ్ జరిగే సమయంలో జల్లులు పడేఅవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో 68 శాతం మేఘావృతమై ఉంటుంది. వర్షం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.