Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు

ఎన్డీఏ అభ్యర్థిగా జగ్‌దీప్‌ ధన్‌కడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా (81) నామినేషన్ దాఖలు చేయనున్నారు. అల్వా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో విపక్ష నేతలు పాల్గొననున్నారు.

Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు

Vice President

Vice President election : ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు. ఎన్డీఏ అభ్యర్థిగా జగ్‌దీప్‌ ధన్‌కడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు ఇతర నేతలతో కలిసి జగ్‌దీప్‌ వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా (81) నామినేషన్ దాఖలు చేయనున్నారు. అల్వా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో విపక్ష నేతలు పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను 19 పార్టీలు ప్రతిపాదించాయి.

కర్ణాటకకు చెందిన మాజీ కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా..గతంలో గోవా, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ గవర్నరుగా పనిచేశారు. పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రిగా, కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రిగా, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. లోక్ సభ, రాజ్య సభ ఎంపీగా సుదీర్ఘకాలం ఆమె పని చేశారు.
Margaret Alva : నేడు నామినేషన్‌ వేయనున్న విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ అల్వా

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. జులై 20న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. జులై 22 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63 లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

దేశవ్యాప్తంగా 788 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్ సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిసస్తూ ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.