CM KCR Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలపై ప్రధానంగా చర్చ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. నిధుల సమీకరణ, పథకాల అమలు, ప్రాజెక్టులు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

CM KCR Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలపై ప్రధానంగా చర్చ

Telangana Cabinet Meeting

CM KCR Cabinet Meeting: సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. నిధుల సమీకరణ, పథకాల అమలు, ప్రాజెక్టులు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఈ కేబినెట్ మీటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రం ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. 2022-2023 బడ్జెట్ లో ఏకంగా రూ. 45వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం కీలకం కానుంది.

CM KCR Independent Diamond Festivals : జాతిని చీల్చేందుకు జరుగుతున్న కుట్రలను అందరూ ఖండించాలి : సీఎం కేసీఆర్

ప్రధానంగా ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో పథకాల అమలు, ప్రాజెక్టుల పనులపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కొత్తగా ఇవ్వనున్న రూ. 10లక్షల పింఛన్లకు సంబంధించి, దళిత బంధు పథకం రెండో విడత అమలుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నీటి పారుదల శాఖలో అడ్ హక్ సీనియారిటీ రూల్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఇన్ చార్జ్ ప్రతిపాదికన పనిచేస్తున్న ఇంజనీర్లకు రివర్షన్ల సమస్య నుంచి ఉపశమనం కల్పించడానికి వీలుగా 12 సూపర్ న్యుమరరీ పోస్టుల సృష్టికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. ఇదిలా ఉంటే కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారా, ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తారా అనేది స్పష్టతరాలేదు.

CM KCR Comments : దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నాయి

ఇదిలాఉంటే జాతీయ రాజకీయాలపైన కేబినెట్ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢీ అంటే ఢీ అన్నట్లుగా కేంద్రంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంను సైతం బహిష్కరిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో నీతి ఆయోగ్ సమావేశంకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం హాజరుకాకపోవటం, మరుసటి రోజే బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. దేశంలో ఎదురులేకుండా దూసుకెళ్తున్న బీజేపీకి ఇది గట్టి ఎదురుదెబ్బే. జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్.. ప్రస్తుత సమయంలో జాతీయ రాజకీయాలపై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాలపై కేబినెట్ మీటింగ్ లో మంత్రులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి.