Deepika Padukone: కలిసి కట్టుగా ఇండియన్ సినిమా.. ఇది అయ్యే పనేనా?

దీపికా పదుకోన్.. అన్ డౌటెడ్ లీ బాలీవుడ్ టాప్ హీరోయిన్. అయితే అంత ఈజీగా స్టార్ హీరోయిన్ అయిపోలేదు. సినిమా సినిమా సినిమా అంటూ సినిమా జపం చేస్తోంది.

Deepika Padukone: కలిసి కట్టుగా ఇండియన్ సినిమా.. ఇది అయ్యే పనేనా?

Deepika Padukone

Deepika Padukone: దీపికా పదుకోన్.. అన్ డౌటెడ్ లీ బాలీవుడ్ టాప్ హీరోయిన్. అయితే అంత ఈజీగా స్టార్ హీరోయిన్ అయిపోలేదు. సినిమా సినిమా సినిమా అంటూ సినిమా జపం చేస్తోంది. సినిమాకు సంబంధించి తన ప్రేమను ప్రతి సారీ ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. లేటెస్ట్ గా ఫ్రెంచ్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్ సినిమా ప్రత్యేకతను చాటింది. ఫ్రెంచ్ రివిరియాలో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ ఇయర్ దీపికా పడుకోన్ జ్యూరీ సభ్యురాలుగా ఉంది. పది రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్స్ లో అన్ని రోజులూ దీపికా పాల్గొంటుంది.

Deepika Padukone : ఓటీటీలతో సినీ పరిశ్రమకు నష్టం లేదు.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పదుకొణె..

అయితే ఈ ఫెస్టివల్స్ లోనే దీపిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇండియన్ సినిమా అంతా ఒకతాటి పైకి వచ్చిందని, గతంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీ వుడ్ అంటూ సపరేట్ సపరేట్ గా ఉండేది. కాని, ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ కలిసి పాన్ ఇండియన్ సినిమాగా పనిచేస్తూ ప్రపంచ స్తాయిలో ఇండియన్ సినిమాను నిలబెట్టడానికి కలసి కట్టుగా ముందుకెళ్తున్నట్టు.. ఇదొక మంచి పరిణామం అని చెప్పుకొచ్చింది. అయితే ఇది అంత ఈజీగా అయ్యే పనిలా అన్నది ఇప్పుడు చర్చగా మారింది.

Deepika Padukone: మిడిల్ ఫింగర్ చూపిస్తూ మీడియాపై రెచ్చిపోయిన దీపికా!

ఇప్పుడు సౌత్ స్టార్స్ నార్త్ లో, నార్త్ స్టార్స్ సౌత్ లో వర్క్ చేస్తున్నారు.. దీపిక కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ షెడ్యూల్స్ లో వర్క్ చేస్తున్నప్పటికీ తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె లో కీరోల్ చేస్తుంది. అంతే కాదు, ఈ మధ్య సౌత్ మూవీస్ నార్త్ లో కూడా సక్సెస్ అవుతుండటంతో దీపిక ఈ కామెంట్స్ చేసిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్న దీపిక. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు విమెన్ ఓరియంటెడ్, హిస్టారికల్ మూవీస్ తో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తోంది.

Deepika Padukone: నీ డ్రెస్ రణ్వీర్ డిజైన్ చేశాడా.. దీపికాపై నెటిజన్ల ట్రోలింగ్

ప్రజెంట్ 5 సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అటు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా డిఫరెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడానికి వెనకాడటం లేదు. లాస్ట్ ఇయర్ 83 సినిమాని ప్రొడ్యూస్ చేసిన దీపిక.. కెరీర్ ని ఏదో ఒక ఇమేజ్ కి పరిమితం చెయ్యకుండా సినిమాకు సంబంధించి ప్రతి రోల్ నీ పర్ ఫెక్ట్ గా పోషిస్తూ తన కెరీర్ తో పాటు, సినిమా డెవలప్ మెంట్ యాక్టివిటీస్ లో హుషారుగా పాల్గొంటుంది దీపికా పదుకోన్. మే 16నుంచి ఫ్రెంచ్, రివిరియాలో స్టార్ట్ అయిన ఈ కేన్స్ ఫెస్టివల్ కు అటు నార్త్ ఇండస్ట్రీ నుంచి, ఇటు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి స్టార్స్, సెలబ్రిటీస్ చాలా మందే హాజరవుతున్నారు.