Tokyo Olympics 2020: పీవీ సింధు ఎంకరేజ్మెంట్ కన్నీళ్లు తెప్పించింది

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం అందుకున్నారు. స్వర్ణంపై ఆశలతో టోర్నీ ఆరంభించిన సింధూకు సెమీ ఫైనల్లో చైనీస్ ప్లేయర్ తైజుయింగ్ బ్రేక్ వేశారు. ఆ మ్యాచ్ ఓడినప్పటికీ.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌ ఓటమి తరువాత సింధు మద్దతుకు కన్నీళ్లొచ్చాయని తైజుయింగ్‌ పేర్కొన్నారు.

Tokyo Olympics 2020: పీవీ సింధు ఎంకరేజ్మెంట్ కన్నీళ్లు తెప్పించింది

Pv sindhu

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం అందుకున్నారు. స్వర్ణంపై ఆశలతో టోర్నీ ఆరంభించిన సింధూకు సెమీ ఫైనల్లో చైనీస్ ప్లేయర్ తైజుయింగ్ బ్రేక్ వేశారు. ఆ మ్యాచ్ ఓడినప్పటికీ.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌ ఓటమి తరువాత సింధు మద్దతుకు కన్నీళ్లొచ్చాయని తైజుయింగ్‌ పేర్కొన్నారు.

తైజు ఇన్‌స్టాలో తన ఆనందన్నా ఇలా పంచుకుంది. ‘గోల్డ్ మెడల్ కోల్పోవడం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒలింపిక్స్‌ కలల వేదికపై మూడోసారి అడుగుపెట్టి.. చివరకు ఫైనల్‌కు చేరుకున్నా. ఫైనల్‌లో విజయం సాధించలేకపోయా. లోపాలు ఎప్పుడూ ఉంటాయి. మెరుగైన ఫలితాన్ని సాధించడమే ఉత్సాహాన్ని ఇస్తుంది’ అంటూ పోస్ట్ చేసింది.

తనను తాను అభినందించుకుంటూ.. తైజూయింగ్‌ ‘యూ ఆర్‌ గ్రేట్‌’ అంటూ కామెంట్ చేసుకుని అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఒక చిన్న విషయాన్ని చెప్పాలంటూ సింధుపట్ల తనకున్న గౌరవాన్ని రాసుకొచ్చింది.

మ్యాచ్ తర్వాత సింధు పరుగెత్తుకువచ్చి ఆలింగనం చేసుకుంది. ఆరోగ్యం బాగా లేకపోయినా, టప్‌ ఫైట్‌ ఇచ్చారు. ఈ రోజు మీది కాకుండాపోయిందంటూ చెప్పి ఏడిపించేసిందంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు.

పూసర్ల వెంకట సింధు రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళగా రికార్డు సాధించారు. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ లో తైజుయింగ్‌ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, హీ బింగ్ జియావోను ఓడించి కాంస్య పతకం దక్కించుకున్నారు.