Tollywood Heroes : ఒక్క హిట్టు ప్లీజ్‌..

స్టార్ స్టేటస్, సూపర్ క్రేజ్.. అయినా ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్నారు టాలీవుడ్‌లో కొంతమంది స్టార్ హీరోలు..

Tollywood Heroes : ఒక్క హిట్టు ప్లీజ్‌..

Tollywood Heroes

Tollywood Heroes: ఎంత స్టార్ హీరోలైనా.. ఒక్కోసారి ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఏదో ఒకటి, రెండు అయితే ఎలా గొలా కమ్‌బ్యాక్ అవ్వొచ్చు.. కానీ వరుసగా ఫ్లాప్స్ వస్తుంటేనే.. ఎప్పుడెప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కుదామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రజెంట్ టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోలు హిట్ కోసం..వెయిట్ చేస్తున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

స్టార్ స్టేటస్, సూపర్ క్రేజ్.. అయినా ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్నారు టాలీవుడ్‌లో కొంతమంది స్టార్ హీరోలు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేని క్రేజ్ ఉన్నా కూడా, సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ టాప్ హీరోలు. స్టార్ హీరోల్లో అర్జెంట్‌గా హిట్ కావల్సింది రామ్ చరణ్‌కి. ‘రంగస్థలం’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. ‘వినయ విధేయ రామ’ తో డ్రాస్టిక్ ఫ్లాప్ ఫేస్ చేశారు.

‘వినయ విధేయ రామ’ సినిమా ఫ్లాప్‌కి ఓపెన్‌గా లెటర్ రాసి మరీ ఫ్యాన్స్‌కి సారీ చెప్పుకున్నాడు. అంత పెద్ద ఫ్లాప్ తర్వాత మళ్లీ సినిమా రిలీజ్ చెయ్యలేదు. 2018 నుంచి రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో ఎంగేజ్ అయిపోయిన రామ్ చరణ్‌ ఇప్పుడు ఆశలన్నీ ట్రిపుల్ ఆర్ మీదే పెట్టుకుని సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్న రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో హిట్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

యంగ్ హీరోల్లో మస్ట్‌గా హిట్ రావల్సిన హీరో విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోని ఈ రౌడీ హీరో.. తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘నోటా’ ఇలా వరుసగా ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. అందుకే హిట్ కోసం డెస్పిరేట్‌గా వెయిట్ చేస్తున్నాడు. ప్రజెంట్ పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా లెవల్లో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్ కూడా ప్రొడక్షన్ పార్టనర్‌గా ఉన్న ఈ సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.

సీనియర్ స్టార్ హీరోల్లో హిట్ కోసం ఎదురు చూస్తున్నది బాలకృష్ణ. ఈ నందమూరి హీరో 2017 లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా తర్వాత బాలయ్యకు సక్సెస్ రాలేదు. ఆ తరవాత రిలీజ్ చేసిన ‘జై సింహ’, ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’, ‘రూలర్’ ఇలా ఏ సినిమాతోనూ ట్రాక్‌లోకి రాలేకపోయారు బాలకృష్ణ. అందుకే తన కెరీర్‌కి మైలేజ్ ఇచ్చిన బోయపాటితో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. ‘అఖండ’ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టి తీరాలని చూస్తున్నారు బాలయ్య బాబు.

మరో సీనియర్ హీరో నాగార్జున కూడా ఈ ట్రాక్‌లోనే వెళ్తున్నారు. వరుసగా ఫ్లాపుల్ని ఫేస్ చేస్తున్న నాగార్జునకు కూడా ఇప్పుడు అర్జెంట్‌గా హిట్ అవసరం ఉంది. ‘ఆఫీసర్’, ‘దేవదాస్’, ‘మన్మథుడు 2’, ‘వైల్డ్ డాగ్’..ఇలా వరుస ఫ్లాపులతో ఉన్న నాగార్జున.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో మాంచి ఫిక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టకపోతే.. కెరీర్ స్లంప్‌లో పడే ఛాన్సుంది కాబట్టి.. నాగ్.. ఈ సినిమా ఎలా అయినా సక్సెస్ కావల్సిందే అని బాగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు.