Tollywood Heroes : కథతో పాటు క్యారెక్టర్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు..

గతంలో హీరోయిజానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చిన డైరెక్టర్స్.. ఇప్పుడు రూట్ మార్చారు. వాళ్లు చేస్తోన్న రోల్స్‌ను కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అయితే సినిమా సెట్స్‌పై ఉండగానే స్టార్స్ చేసే రోల్స్ ఏంటో రివీలవుతున్నాయి..

Tollywood Heroes : కథతో పాటు క్యారెక్టర్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు..

Tollywood Heroes Showing Different Characters

Tollywood Heroes: గతంలో హీరోయిజానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చిన డైరెక్టర్స్.. ఇప్పుడు రూట్ మార్చారు. వాళ్లు చేస్తోన్న రోల్స్‌ను కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అయితే సినిమా సెట్స్‌పై ఉండగానే స్టార్స్ చేసే రోల్స్ ఏంటో రివీలవుతున్నాయి. రీసెంట్‌గా నాని, మహేష్, చిరు, చరణ్ వంటి స్టార్స్ అప్ కమింగ్ మూవీస్‌లోని క్యారెక్టర్స్ వైరల్‌గా మారాయి.

కొత్త రోల్స్‌తో టాలీవుడ్ హీరోల ట్రెండ్.. కథ మాత్రమే కాదు, స్టోరీలో క్యారెక్టర్స్ ముఖ్యమే అంటున్నారు మేకర్స్. అవును, ఇప్పుడు సినిమా అంటే హీరోయిజం చూపిస్తే సరిపోదు.. హీరోలు ఏం జాబ్ చేస్తున్నారో కూడా ఎలివేట్ చేయాలి. అందుకే హీరో చేయబోతున్న రోల్ పరంగానే క్రేజీ కథలను క్రియేట్ చేస్తున్నారు డైరెక్టర్స్. ఎగ్జాంపుల్ నాని పీరియాడికల్ ఫిల్మ్ ‘శ్యామ్ సింగ రాయ్’ నే తీసుకుందాం. ఇందులో నాని డిటెక్టివ్‌గా కనిపిస్తారని టాక్. ‘షెర్ లాక్ హోమ్స్’ – సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’ సినిమాల లైన్‌లో థ్రిల్లింగ్ డిటెక్టివ్ కాన్సెప్ట్‌గా తెరకెక్కుతోంది ‘శ్యామ్ సింగ రాయ్’..

Shyam Singha Roy

‘సర్కారు వారి పాట’ లో బ్యాంక్ మేనేజర్‌గా కనిపించనున్నారు సూపర్‌స్టార్. బ్యాంక్ స్కాం నేపథ్యంగా పరశురాం ఈ సినిమాను డిజైన్ చేశారని సమాచారం. మహేష్ బ్యాంక్ మేనేజర్‌గా నటిస్తుంటే.. ఆయన సబార్డినేట్‌గా కీర్తి సురేష్ కనిపిస్తారని తెలుస్తోంది. మరోవైపు మహేష్ బాబు కోసం క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరిని ప్రిపేర్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. ‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్‌ను ఆర్మీ ఆఫీసర్‌గా పరిచయం చేసి కామెడీ పండించిన అనిల్.. ఫ్యూచర్‌లో క్రికెట్ కోచ్‌గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata

చరణ్ – శంకర్ ప్రాజెక్ట్‌లో ఐఏఎస్ ఆఫీసర్ ప్లస్ ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ నటిస్తారనే వార్తలొచ్చాయి. ప్రవీణ్ సత్తారు సినిమాలో రా ఏజెంట్ గా నాగ్ యాక్ట్ చేస్తున్నారు. ‘అఖండ’ లో కాసేపు అఘోరాగా బాలయ్య రోల్ డిజైన్ చేశారు.

Acharya
ఇక ‘పుష్ప’ లో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తుంటే.. ‘ఆచార్య’ లో మాజీ నక్సలైట్‌గా చిరు, స్టూడెంట్ లీడర్‌గా చరణ్ మెరవనున్నారు. ‘విరాట పర్వం’ లో మావోయిస్ట్‌గా రానా, ‘గని’ లో బాక్సర్‌గా వరుణ్ తేజ్, ‘మ్యాస్ట్రో’ లో అంధుడైన కీబోర్డ్ ప్లేయర్‌గా నితిన్.. ఇలా క్యారెక్టర్స్ నుంచే కథ పుట్టేలా కొత్తగా ఆలోచిస్తున్నారు మేకర్స్..

Akhanda