Heroines : సభ్య సమాజానికి సందేశాలిస్తున్నారు..

షూటింగ్స్ లేవ్.. సినిమాలు లేవ్.. రిలీజ్‌లు లేవ్.. ఇవన్నీ లేకపోతే ఖాళీగా ఉండి ఏం చేస్తారు పాపం హీరోయిన్లు..

Heroines : సభ్య సమాజానికి సందేశాలిస్తున్నారు..

Tollywood Heroines Message To People

Heroines: షూటింగ్స్ లేవ్.. సినిమాలు లేవ్.. రిలీజ్‌లు లేవ్.. ఇవన్నీ లేకపోతే ఖాళీగా ఉండి ఏం చేస్తారు పాపం హీరోయిన్లు..? అందుకే ఈ పాండిమిక్ టైమ్‌లో తమకు తోచినట్లు జాతికి సందేశాలు ఇస్తున్నారు. ఇంతకీ జనానికి ఏం జాగ్రత్తలు చెబుతున్నారో చూద్దాం..

సెకండ్ వేవ్‌తో మరోసారి సేఫ్‌గా ఇంట్లోనే టైమ్ పాస్ చేస్తున్నారు సినిమా వాళ్లు. హీరోల కంటే హీరోయిన్లే ఫ్యాషన్ షోస్, ఫోటో షూట్స్ అంటూ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు. కానీ ఇప్పుడు షూట్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉండాల్సొస్తోంది. అందుకే ఈ కరోనా టైమ్‌లో ఖాళీగా ఉండడం ఎందుకని జాతికి సందేశాలిస్తూ వీడియోలు చేస్తున్నారు.

లేటెస్ట్‌గా పూజా హెగ్డే.. ఆడవాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్ట్రాంగ్‌గా ఉండాలి, అలా కాన్ఫిడెంట్‌గా ఉంటేనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం అంటూ సోషల్ మీడియాలో చిన్న వీడియో పోస్ట్ చేసింది.

ఫిట్‌నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా జనానికి నాలుగు మంచి మాటలు చెబుతోంది. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఒక పక్క ఫిట్‌నెస్ చేసుకుంటూ టిప్స్ చెప్తున్న రకుల్ లేటెస్ట్‌గా మరో సోషల్ ఇంట్రెస్ట్ వీడియో పోస్ట్ చేసింది. బెటర్ ఎన్విరాన్‌మెంట్ కోసం ప్లాస్టిక్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ వాడండి అంటూ స్వీట్ అండ్ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.

మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ అయితే ఇంకొక అడుగుముందుకేసి.. ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయాన్ని హైలెట్ చేసింది. కరోనా టైమ్ లైఫ్ రిస్క్‌లో పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ల మీద జరుగుతున్న హింసని ఆపాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అనుపమా పరమేశ్వరన్. ఇంతకుముందు కూడా రిలీఫ్ ఫండ్‌కి తనకు చేతనైన సాయం చేసి అందర్నీ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చెయ్యాలని ఆడియెన్స్‌ని కోరింది అనుపమ.