‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న టాలీవుడ్ స్టార్స్..

  • Edited By: sekhar , December 9, 2020 / 08:24 PM IST
‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న టాలీవుడ్ స్టార్స్..

Tollywood Bachelor’s: టాలీవుడ్‌లో బ్యాచిలర్ లిస్ట్ తగ్గిపోతోంది. కోవిడ్ టైమ్ అయినా కూడా కామ్‌గా కొంతమంది పెళ్లిళ్లు చేసేసుకున్నారు. లేటెస్ట్‌గా మెగా డాటర్ నిహారిక పెళ్లి కూడా అయిపోయింది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కంప్లీట్ ఫోకస్ సినిమాలపైనే పెట్టిన మన హీరోలు ఓ వైపు ఏజ్ పెరిగిపోతున్నా పెళ్లిని మాత్రం పోస్ట్‌పోన్ చేస్తున్నారు. అలా ‘సోలో బ్రతుకే సో బెటర్’ జపం చేస్తున్న హీరోలెవరో చూద్దాం.

మెగా డాటర్ మెగా మ్యారేజ్
మెగా వారి ముద్దుల కూతురు కొణిదెల నిహారిక పెళ్లి అంబరాన్నంటే ఆనందంతో జరిగిపోయింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 3 రోజుల నుంచి మెహందీ, సంగీత్, హల్దీ.. ఇలా రకరకాల ఈవెంట్స్‌తో సందడి చేస్తున్న మెగా ఫ్యామిలీ సంబరాలు.. బుధవారం రాత్రి జరిగిన నిహారిక, చైతన్య పెళ్లితో పీక్స్‌కి వెళ్లాయి.

మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యి #NisChayWedding ని సెలబ్రేట్ చేశారు. నిహారిక, చైతన్య కూడా పెళ్లితంతు కంప్లీట్‌గా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసి ఆఖరికి మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.

Niharika Konidela

ప్రభాస్ పెళ్లెప్పుడు?..
టాలీవుడ్‌లో ఒక్కొక్కరు బ్యాచిలర్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతున్నారు. మంచి టైమ్ చూసుకుని కరెక్ట్ ఏజ్‌లో కొంతమంది పెళ్లి చేసుకుంటుంటే కొంతమంది హీరోలు మాత్రం అసలు పెళ్లి ఊసే లేకుండా తప్పించుకుపోతున్నారు. ఎప్పుడో 4 ఏళ్ళనుండి నానుతున్న ప్రభాస్ పెళ్లి విషయం ఇండస్ట్రీలో ఎప్పటికీ హాట్ టాపికే..

‘బాహుబలి’ ముందు నుంచి ప్రభాస్ పెళ్లిపై రోజుకో రూమర్ నడుస్తూనే ఉంది. ‘బాహుబలి’ అయిపోయింది. ‘సాహో’ అయిపోయింది. వరుసగా 4 ఏళ్లకు సరిపడా సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. అంతేకాదు.. ప్రభాస్‌కి 40 ఏళ్లుకూడా వచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం పెళ్ళి ఊసెత్తడం లేదు.

Prabhas

స్నేహితురాలితో శర్వానంద్ పెళ్లి
శర్వానంద్.. చూడ్డానికి క్యూట్‌గా కనిపిస్తాడు. అప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసుకుని సినిమాల్లోకి వచ్చాడా అనిపిస్తుంది. కానీ శర్వా కూడా ఎప్పుడో 30 దాటేశాడు. ఇంకా చెప్పాలంటే 30 క్రాస్ చేసి ఆరేళ్లు అవుతోంది కాబట్టి నిజానికి పెళ్లి ఏజ్ దాటిపోయినట్టే.

అయితే మొన్నామధ్య ఉపాసన కొణిదెల రిలేటివ్స్ అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకుంటున్నాడన్న రూమర్ బాగా నడిచింది. తన చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి ఫిక్స్ అని కూడా వార్తలు వచ్చాయి కానీ శర్వా మాత్రం పెళ్లి మీద క్లారిటీ ఇవ్వలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శర్వా ఇప్పుడప్పుడే పెళ్లి మాటెత్తేలా కనిపించడంలేదు.

Sharwanand

విజయ్ దేవరకొండ వెడ్డింగ్ ఎప్పుడయ్యా..
లాస్ట్ ఇయరే 30 క్లబ్‌లో చేరిపోయాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. యూత్‌లో పిచ్చి క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. సినిమాలతో బిజీగా ఉన్నానని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్తున్నాడు.

కానీ.. ఆ మధ్య కాలంలో తన ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉన్న ఓ ఫారెన్ అమ్మాయితో రిలేషన్ గురించి పెద్ద పెద్ద చర్చలే జరిగాయి సోషల్ మీడియాలో. కానీ ఇప్పటి వరకు పెళ్ళి ప్రస్తావన మాత్రం తేలేదు విజయ్.

Vijay Deverakonda

 

రామ్ పోతినేని ‘రెడీ’నా..
మొన్నటివరకు పెళ్లి కాని ప్రసాదుల జాబితాలోలేని రామ్ ఎప్పుడైతే 30 నంబర్ క్రాస్ చేశాడో… అప్పుడే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ లిస్ట్‌లో చేరిపోయాడు. మొన్నటివరకు ఇంటర్వ్యూల్లో పెళ్లికి సంబంధించి పెద్దగా క్వశ్చన్స్ ఫేస్ చేయలేదు రామ్.

‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టి ‘రెడ్’ మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. సినిమాల బిజీలో పడి పెళ్లి సంగతే మర్చిపోయినట్టున్నాడు రామ్. అందుకే అసలు పెళ్లి గురించి మాటే ఎత్తడం లేదు. రాబోతున్న కొత్త సంవత్సరంలో అయినా.. పెళ్లి గురించి ఎనౌన్స్ చేస్తారో లేదో చూడాలి..

Ram

‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న సాయి తేజ్..
సాయి ధరమ్ తేజ్.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరో 30 క్రాస్ చేసి మూడేళ్లపైనే అయ్యింది. అయినా ఇంత వరకు పెళ్లి ఊసు లేదు. లాస్ట్ ఇయర్ వరకూ సరైన హిట్ లేని సాయి.. ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ కొట్టాడు..

దాంతో మరికొన్ని హిట్లు సాధించి.. ఇండస్ట్రీలో పాతుకుపోవాలని చూస్తున్నాడు. మొన్నామధ్య తేజ్ ఈ సంవత్సరంలోనే పెళ్లి చేసుకుంటున్నట్టు న్యూస్ వచ్చినా.. అబ్బే అలాంటిదేం లేదంటున్నాడు సుప్రీమ్ హీరో.

Sai Dharam Tej

వరుణ్ తేజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు..
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కూడా 30 క్లబ్‌లో జాయిన్ అయ్యాడు. కానీ పెళ్లా..? నాకా అంటున్నాడీ టాల్ హీరో. నాకు అప్పుడే పెళ్లేంటి..? నేనింకా చాలా సినిమాలు చెయ్యాలి అంటూ తప్పించుకుంటున్నాడు వరుణ్ తేజ్.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. తన రూట్ సెపరేట్ అనిపించుకుంటున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడప్పుడే పెళ్లి లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Varu Tej

నేనింకా పిల్లాడినే అంటున్న నాగ శౌర్య..
మొన్నీ మధ్యే ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 20 సినిమాలు చేసి, ఓన్ ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టి అటు ప్రొడ్యూసర్‌గా ఇటు హీరోగా స్పీడ్ మీదున్న హీరో నాగశౌర్య కూడా టాలీవుడ్ బ్యాచిలర్ లిస్ట్‌లోనే ఉన్నాడు.

31 ఏళ్ల శౌర్య.. నాకప్పుడే పెళ్లేంటి..? నేనింకా చిన్న పిల్లాడినే అంటున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న శౌర్యను చూస్తుంటే ఇప్పుడప్పుడే పెళ్లి వైపుకు వెళ్లేలా లేడు.

Naga Shaurya