Movie Shootings : షూటింగ్‌కు రెడీ..

కరోనా వల్ల సడెన్‌గా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.. లాక్‌డౌన్ రిలాక్స్ చెయ్యడంతో.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు..

Movie Shootings : షూటింగ్‌కు రెడీ..

Movie Shootings

Movie Shootings: కరోనా వల్ల సడెన్‌గా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. లాక్‌డౌన్ రిలాక్స్ చెయ్యడంతో.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. మరి ఏ హీరోలు ఎప్పుడెప్పుడు షెడ్యూల్స్ వేసుకున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

కోవిడ్ వల్ల ఇప్పటికే సినిమాలు లేటవుతున్నాయని, షూటింగ్‌ని త్వరగా కంప్లీట్ చెయ్యాలని చకచకా షెడ్యూల్స్ వేసుకుంటోంది టాలీవుడ్. ఇప్పటికే నితిన్, మేర్లపాక గాంధీతో చేస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమా స్టార్ట్ చేసేసింది. తమన్నా, నభానటేష్, నితిన్ లీడ్ రోల్స్‌లో నటిస్తూ, బాలీవుడ్ ‘అందాధున్’ కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ సోమవారం మొదలుపెట్టింది.

మరో యంగ్ హీరో నిఖిల్ కూడా సుకుమార్ రైటింగ్స్‌లో చేస్తున్న ‘18 పేజెస్’ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలోనే షూటింగ్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యారు టీమ్. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా వేరే సినిమా స్టార్ట్ చెయ్యాలంటే ఇంకా ప్యాచప్ మాత్రమే ఉన్న ‘ఖిలాడి’ ని కంప్లీట్ చెయ్యాలి కాబట్టి.. ఈ వారంలోనే ‘ఖిలాడి’ షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు రవితేజ.

చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ‘ఆచార్య’ సినిమా ఇప్పటికే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ సినిమా రిలీజ్ చెయ్యాలని షూటింగ్ కూడా నెక్ట్స్ వీక్ నుంచే మొదలుపెడుతున్నారు ‘ఆచార్య’ యూనిట్. బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్న బాలయ్య కూడా వచ్చే వారమే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడితో మొదలుపెట్టిన ‘ఎఫ్ 3’ షూట్‌‌ని కూడా జూన్‌లోనే మొదలుపెడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ కూడా ఆగస్ట్‌లోనే అని అనౌన్స్ చేసింది టీమ్. నాగ చైతన్య – రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమాతో పాటు, నాని – రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్స్ కూడా ఈ నెల 21 నుంచి మొదలు పెట్టబోతున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూడేళ్ల నుంచి షూటింగ్ చేస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’ ప్యాచ్ వర్క్ ఈ నెల 25 నుంచి షూట్‌కి వెళుతోంది. ఇక సౌత్ అంతా సూపర్ ఎగ్జైటెడ్‌గా వెయిట్ చేస్తున్న ‘పుష్ప’ సినిమా కూడా రాజమండ్రి లోకల్ ఏరియాస్‌లో ఈ నెల 28 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తోంది.

‘సర్కారు వారి పాట’ ను సూపర్ ఫాస్ట్‌గా షూట్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా షూటింగ్ రీ స్టార్ట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అందరిలా ఈ నెలలో కాకుండా నెక్ట్స్ మంత్ షూటింగ్ మొదలు పెడదామని, మ్యాగ్జిమమ్ జులై 5 నుంచి సెట్స్ మీదకెళదామని డిసైడ్ అయ్యారు ‘సర్కారు వారి పాట’ టీమ్.