WhatsApp and Meta: వాట్సాప్, మెటా సంస్థల కీలక ఉద్యోగులు రాజీనామా.. ఇద్దరూ భారతీయులే

వాట్సాప్, మెటా సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు రాజీనామా చేశారు. వాట్సాప్ ఇండియా హెడ్‌గా ఉన్న అభిజిత్ బోస్, మెటా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న రాజీవ్ అగర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు.

WhatsApp and Meta: వాట్సాప్, మెటా సంస్థల కీలక ఉద్యోగులు రాజీనామా.. ఇద్దరూ భారతీయులే

WhatsApp and Meta: వాట్సాప్, మెటా సంస్థలకు చెందిన కీలక ఉద్యోగులు పలువురు రాజీనామా చేశారు. వీరిలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. వాట్సాప్ ఇండియా హెడ్‌గా ఉన్న అభిజిత్ బోస్, మెటా సంస్థలో డైరెక్టర్ పబ్లిక్ పాలసీలో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్ రాజీవ్ అగర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు.

G20 summit..Rishi Sunak : ‘రష్యా చేసేది అనాగరిక యుద్ధం..ఈ సదస్సుకు పుతిన్ వచ్చి ఉంటేనా..’ అంటూ రష్యా మంత్రి ఎదుటే రిషి సునక్ ఘాటు వ్యాఖ్యలు

ఇప్పటికే వీళ్లు తమ రాజీనామాలను సమర్పించారు. వీళ్ల రాజీనామాకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. తాజాగా మెటా సంస్థ తమ గ్రూపు కంపెనీలకు చెందిన వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు కూడా ధృవీకరించాయి. అలాగే రాజీనామా చేసిన వారి స్థానాల్లో ఇప్పటికే కొత్త వాళ్లను నియమించినట్లు కూడా కంపెనీలు ప్రకటించాయి. అభిజిత్ బోస్ వాట్సాప్ ఇండియా హెడ్‌గా నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నాడు. కీలకమైన ప్రాజెక్టుల్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అభిజిత్ బోస్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనకు వాట్సాప్ హెడ్ విల్ క్యాచర్ట్ ధన్యవాదాలు తెలిపారు. కంపెనీకి ఎంతో సేవ చేశాడని ప్రశంసించారు.

Nasa Artemis-1 Launch: నేడు చంద్రుడిపైకి అర్టెమిస్-1 ప్రయోగం.. ఈసారైనా నింగికెగురుతుందా..

ఇక అభిజిత్ బోస్.. తాను ప్రస్తుతం బ్రేక్ తీసుకుని, కొంతకాలం తర్వాత తిరిగొస్తానని ప్రకటించాడు. రాజీవ్ అగర్వాల్ కూడా మెటా ఇండియాలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా యూజర్ సేఫ్టీ, ప్రైవసీ పాలసీ వంటివి సక్సెస్ చేయడంలో విశేష కృషి చేశాడు. రాజీవ్ రాజీనామాపై ‘మెటా’ సంస్థ స్పందించింది. ఆయన కొత్త బాధ్యతలు చేపట్టే ఉద్దేశంతోనే కంపెనీకి రాజీనామా చేసినట్లు మెటా పేర్కొంది. రాజీవ్ అగర్వాల్ స్థానంలో శివనాథ్ తుక్రాల్‌ను నియమించింది.