Rohit Sharma: టాస్ గెలవడం కలిసొచ్చింది – రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌పై తొలి వన్డే గెలిచిన అనంతరం తమకు టాస్ గెలుచుకోవడం కలిసొచ్చిందని.. బౌలింగ్ తీసుకుని కరెక్ట్ గా ఎదుర్కోగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడంతో కెన్నింగ్టన్ ఓవల్‌లో..

Rohit Sharma: టాస్ గెలవడం కలిసొచ్చింది – రోహిత్ శర్మ

Rohit Sharma (1)

Rohit Sharma: ఇంగ్లండ్‌పై తొలి వన్డే గెలిచిన అనంతరం తమకు టాస్ గెలుచుకోవడం కలిసొచ్చిందని.. బౌలింగ్ తీసుకుని కరెక్ట్ గా ఎదుర్కోగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టడంతో కెన్నింగ్టన్ ఓవల్‌లో మంగళవారం జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

‘వాతావరణ పరిస్థితులు, పిచ్ చూశాక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. ముందుగా పరిస్థితులను బాగా వినియోగించుకున్నాం. జట్టులో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగలిగే ప్లేయర్లున్నారు. కొంత స్వింగ్, సీమ్ ఉంది. వాటిని -బాగా ఉపయోగించుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆడుతున్నప్పుడు ఏది కలిసొస్తుందనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. దానికి అనుగుణంగా ప్లేయర్లను ఆడించాలి’ అని రోహిత్ మ్యాచ్ తర్వాత వివరించాడు.

రోహిత్ 58 బంతుల్లో 76 పరుగులు చేయగా, శిఖర్ 54 బంతుల్లో 31 పరుగులు చేసి కేవలం 18.4 ఓవర్లలోనే 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేశారు.

Read Also: కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడాలంటే ఇది గుర్తుపెట్టుకోండి – రోహిత్ శర్మ

“మా బౌలర్లు బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగలరని మాకు తెలుసు. మొదటి బంతిని తప్పుగా అంచనా వేయడం మినహా శిఖర్ కు నాకు సమన్వయం బాగా కుదిరింది. ధావన్ చాలా కాలం తర్వాత ODI మ్యాచ్ ఆడాడు. అనుభవజ్ఞుడు కాబట్టే పరిస్థితులను అర్థం చేసుకుని ఆడాడు. హుక్ అనేది హై రిస్క్ షాట్ అని అర్థం చేసుకోగలను. అది వర్కౌట్ అయినందుకు హ్యాపీగా ఉన్నా” అని రోహిత్ అన్నారు.