Tamil Nadu : నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు..సీఎం కీలక నిర్ణయం

తాను ప్రయాణించే కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా తగ్గించారు సీఎం స్టాలిన్. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Tamil Nadu : నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు..సీఎం కీలక నిర్ణయం

Cm Stalin

M.K. Stalin Convoy : ముఖ్యమంత్రి తన కార్యాలయం లేదా ఇంటికి..ఇతర పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో ట్రాఫిక్ పై పలు ఆంక్షలు విధిస్తుంటారనే సంగతి తెలిసేందే. ఆయన వెళ్లే మార్గంలో సామాన్య ప్రజలు వెళ్లకుండా ఆపుతారు. దీంతో ఆయన వెళ్లే వరకు అలాగే ఉండాల్సి ఉంటుంది. ఆయన వెళ్లిన అనంతరం అనుమతినిస్తుండడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కలుగుతుంటాయి. దీంతో కొంతమంది ముఖ్యమంత్రులు దీనిని దృష్టిలో ఉంచుకుని..ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు పెట్టవద్దని సూచిస్తుంటారు. వీరు కూడా సామాన్య ప్రజలలాగానే ప్రయాణిస్తుంటారు. తాజాగా..తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

Read More : India : రికార్డు స్థాయికి, హైదరాబాద్‌లో సెంచరీ దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు

అధికారంలోకి వచ్చిన తర్వాత..ఆయన సామాన్యుడిలాగానే ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి…సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా శ్రేయస్సే పరామవధిగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. ప్రజల మధ్యే తిరుగుతున్నారు. తాజాగా..తాను ప్రయాణించే కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా తగ్గించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా..ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా పయనించే రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన ప్రయాణించే కాన్వాయ్ లో పదికి పైగా వాహనాలు ఉంటాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని భావించి..వాహనాల సంఖ్యను కూడా తగ్గించారు. ఆయన పయనించే మార్గాల్లో ట్రాఫిక్ ను నిలపరు. ప్రజలతో కలిసి ఆయన కాన్వాయ్ సాగే విధంగా…ఆదివారం నుంచి చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయాన్పి ప్రజలు స్వాగతిస్తున్నారు.