Hyd Traffic Police : చలానా డిస్కౌంట్ ఆఫర్ ముగిసింది.. యువతికి రెండు రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ యువతికి నాంపల్లి మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష వేసింది. అంతేగాకుండా.. జరిమానాతో పాటు డ్రైవింగ్ లెసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేసింది...

Hyd Traffic Police : చలానా డిస్కౌంట్ ఆఫర్ ముగిసింది.. యువతికి రెండు రోజుల జైలు శిక్ష

Traffic E Challans

Pending Challan Discount : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన పెండింగ్ చలానా డిస్కౌంట్ ఆఫర్ ముగిసింది. తర్వాత.. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల తాట తీస్తున్నారు. ఇప్పటికే ఉల్లంఘనలపై చార్జ్ షీట్ లు నమోదు చేస్తున్నారు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ యువతికి నాంపల్లి మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష వేసింది. అంతేగాకుండా.. జరిమానాతో పాటు డ్రైవింగ్ లెసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 80 మంది వాహనదారులకు జరిమాన విధించింది. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్, రేసింగ్/స్టంట్ లు, నంబర్ ప్లేట్ లేని ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చార్జ్ షీట్ లు దాఖలు చేశారు.

Read More : Vehicle pending challans : లాస్ట్ డే.. నేటితో ముగియనున్న పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ గడువు..

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు పోలీస్ శాఖ అధికారులు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో పెండింగ్ లో ఉన్న చలాన్లను చెల్లిస్తే డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 2 వీలర్ వాహనదారులు పెండింగ్ చలాన్‌లో 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అంటే మిగతా 75 శాతాన్ని అధికారులు మాఫీ చేశారు. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతంగా చెల్లింపునకు అవకాశం ఇచ్చారు. చెల్లింపు విధానాన్ని ఆన్‌లైన్, మీసేవా, ఆన్‌లైన్ గేట్‌వేల ద్వారా చేసుకొనే అవకాశం ఇచ్చారు. మార్చి 31తో ముగియనుండగా మరో గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రాయితీ అవకాశాన్ని పొడిగించినట్లు తెలిపారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.