Traffic‌ restrictions: ఆ రూట్‌లలో వెళ్లొద్దు.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు, ఉపవాస దీక్షలకు చివరి శుక్రవారం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ...

Traffic‌ restrictions: ఆ రూట్‌లలో వెళ్లొద్దు.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

Trafic Rules

Traffic‌ restrictions: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు, ఉపవాస దీక్షలకు చివరి శుక్రవారం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గోనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఇఫ్తార్ విందు ఉంటుందని, ఈ క్రమంలో అటువైపు వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సాయంత్రం 5 నుంచి 9గంటల సమయంలో వాహనదారులు ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం, అక్కడి నుండి బషీర్ బాగ్ ఇరువైపుల వెళ్లకుండా ప్రత్యామ్నాయ రూట్లకు వాహనాలను మళ్లించనున్నారు.

Wedding: వరుడుని కాదని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్న వధువు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..

చాపల్ రోడ్డు, నాపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు బీజేఆర్ విగ్రహం వైపు అనుమతి ఉండదు. ఈ మార్గంలో వచ్చేవి ఏ‌ఆర్ పెట్రోల్ బంక్ వద్ద పీసీఆర్ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా ఎస్బీఐ గన్ ఫౌండ్రి వైపు నుంచి ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ప్లై ఓవర్ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఎస్బీఐ వద్ద చాపర్ రోడ్డులోకి మళ్లిస్తారు. రవీంద్రభారతి, హిల్ పోర్టు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు కాకుండా, కేఆర్‌కే బిల్డింగ్ వద్ద సుజాత హైస్కూల్ రూట్లోకి పంపిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్బాగ్ వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్ నగర్ వై జంక్షన్ వైపు మళ్లించనున్నారు. అదేవిధంగా కింగ్ కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్ బాగ్ వైపు భారతీయ విద్యాభవన్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్‌కోఠి ఎక్స్‌రోడ్స్‌లో తాజ్ మహల్, ఈడెన్ గార్డెన్ వైపు మళ్లించనున్నారు. బషీర్బాగ్ నుంచి పీసీఆర్ వైపునకు వాహనాల అనుమతి ఉండదని, ఈ వాహనదానులను లిబర్టీ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Sonu Sood: సౌత్ VS నార్త్.. అజయ్‌, సుదీప్‌ల ట్విటర్‌ వార్‌పై సోనూసూద్‌ కామెంట్స్!

అదేవిధంగా రంజాన్ ఉపవాస దీక్షలకు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీద్, సికింద్రాబాద్‌లోని జమే ఈ మసీద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో చార్మినార్ నుంచి మదీనా, చార్మినార్, ముర్గీచౌక్, రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ రోడ్లను మధ్యాహ్నం 3గంటల వరకు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.