భలే భలే ఛుక్..ఛుక్.. ‘రైలు బడి’ చూడండీ..

భలే భలే ఛుక్..ఛుక్.. ‘రైలు బడి’ చూడండీ..

train style government school : చిన్నప్పుడు ఛుక్..ఛుక్ రైలు బండి వస్తుంది..దూరం దూరం జరగండీ..ఆగినతరువాత ఎక్కండీ..అనే పాటలు పాడుకుంటూ ఒకరి వెనకాల మరొకరు పిల్లలు లైనుగా తిరుగుతూ ఆడుకునే ఆటలు గుర్తున్నాయి కదూ..అవన్నీ తీపి జ్ఞాపకాలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కానీ ఓ స్కూలుకు మాత్రం పిల్లలు ఛుక్..ఛుక్ ‘రైలు బడి’ అని ఆడుకుంటూ హుషారుగా వస్తున్నారు. ఏంటీ రైలు బడి కాదు రైలు బండి అనుకుంటున్నారా? కానే కాదు నిజంగానే అది ‘రైలు బడి’నే..ఈ ‘రైలు బడి’ని పిల్లల్ని ఆకట్టుకునేలా అచ్చంగా రైలు బండిలా తయారు చేశారు ప్రభుత్వ స్కూల్‌ని.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పుర్‌లో భైర్గావ్ గ్రామంలో ఉందీ ‘రైలు బడి’ పాఠశాల. లాక్‌డౌన్ తర్వాత పిల్లలు స్కూల్‌కు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో పిల్లల్ని స్కూలుకు రప్పించేందుకు వినూత్నంగా స్కూల్ ను రైలు బడిలా మార్చేశారు.


ప్రభుత్వ స్కూల్‌కు రైలు బోగీలా పెయింటింగ్ వేశారు. స్కూల్ ఉన్న చోట రైలు బోగీ కనిపించేసరికి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు. ఆ తరువాత రైలు బోగీలా పెయింటింగ్ వేశారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి భలే భలే ఛుక్..ఛుక్ ‘రైలు బడి’ అని పాడుకుంటూ హుషారుగా స్కూల్ కు వచ్చేస్తున్నారు పిల్లకాయలంతా..

స్కూల్ క్లాస్ రూమ్, కారిడార్ మొత్తం ఎక్కడ చూసినా అచ్చు రైలు బోగీలానే ఉంటుంది. స్కూల్ రూమ్ డోర్ కూడా రైలు డోర్‌లాగానే పెయింటింగ్ వేశారు. కిటికీలు కూడా రైలుకు ఉన్నట్టుగానే డిజైన్ చేశారు. స్కూల్‌లో కిచెన్ రైలు ఇంజిన్‌లా ఉంటుది.

రైలు బోగీలా మారిపోయిన స్కూల్‌ను చూసేందుకు ఆ చుట్టుపక్కల గ్రామాలవారంతా వచ్చి చూసి ‘‘ఇది రైలు బండి కాదు రైలు బడి’’ అంటున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఫిబ్రవరి 10న 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు స్కూళ్లు తెరిచింది యూపీ ప్రభుత్వం.

అచ్చు రైలుబండిలా ఉన్న ఈ రైలు బండి బండిని చూసి భారతీయ రైల్వే తెగ ముచ్చట పడిపోయింది. తన ట్విట్టర్‌లో ఈ రైలుబడి ఫోటోలను పోస్ట్ చేసింది. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ ఈ ‘రైలు బండి మీద కాదు కాదు రైలు బడి’మీద..

ఇటువంటి స్కూళ్లు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. స్కూళ్లను రెగ్యులర్ గా కాకుండా పిల్లలను ఆకట్టుకునేలా చేసి ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచేలా క్రియేటీవ్‌గా తీర్చిదిద్దుతున్నారు.అటువంటి కొన్ని స్కూల్స్ ను ..

 

కర్ణాటకలోని నాన్జాంగుడ్ Nanjangud తాలూకాలోని గవర్నమెంట్ స్కూల్ ఇది..

మరిన్ని రైలు బడులివి..